.webp)
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో చూస్తే ఒక్కసారి షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఈ రాబోయే ఎపిసోడ్ లో ఆది కనిపించబోతున్నాడు. ఇక ఈ ప్రోమో లాస్ట్ లో "నాగబాబు గారిని చూడగానే జబర్దస్త్ కి ఒక కొత్త కళ వచ్చిందనుకునే లోపే రష్మిని చూడగానే జబర్దస్త్ ఓల్డ్ ఐపోయిందబ్బా అనిపిస్తోంది" అన్నాడు. దాంతో రష్మీ ఏయ్ అని అరిచింది. ఇక కమెడియన్స్ కి మంచి సూచనలు ఇచ్చాడు ఆది
. "మీ జీవితం అనేది వాళ్ళ కామెంట్స్ మీద ఆధార పడుంది. స్కిట్ బాగుందంటే రూమ్ కి పిలిచి పొంగల్ పెడతాడు. బాలేదు " అంటూ గడ్డం గోక్కుంటూ చూపించాడు ఆది. "మీకు తెలుసు కదా రామ్ ప్రసాద్, సుధీర్ అన్న, గెటప్ శీను అన్న ఉన్నప్పుడు ఆటో ఇప్పుడు అటో ఇటో అవుతోంది కానీ" అంటూ ఆటో రాంప్రసాద్ మీద జోక్స్ వేసాడు. ఇక గతంలో తన స్కిట్స్ లో జడ్జ్ నాగబాబు చేసిన కామెంట్స్ ని గుర్తు చేసుకుని రీప్లే చేశారు. "ఈ పదాలు నాకు ఎంత బూస్ట్ ఇచ్చేవంటే సర్ నా వ్యూయర్ షిప్ ని అలా కాపాడుకుంటూ రావడానికి వనాఫ్ ది మెయిన్ రీజన్ వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మీరే సర్ " అన్నాడు ఆది. "ఎప్పుడొస్తావ్ జబర్దస్త్ కి" అని నాగబాబు అడిగారు.
"ఎవరైతే మిస్ అయ్యారో వీళ్ళతో కంబినేషన్ ని సెట్ చేసుకుని జూన్ నుంచి వచ్చేలా నేను ప్లాన్ చేసుకుంటా సర్ షోలో" అని చెప్పాడు. ఇక ఆది మాటలు విన్న నెటిజన్స్ ఫుల్ జోరుగా హుషారుగా కామెంట్స్ పెడుతున్నారు. "హైపర్ ఆది అన్నా వస్తున్నాడోచ్ . ఇక జబర్దస్త్ ని ఒక ఆట ఆడుకుంటాడు ఇక ఈటివిని శుక్ర, శని వదలకుండా చూస్తాం జై ఆది అన్నా జై జబర్దస్త్. చమక్ చంద్ర వస్తున్నార? లేదా? కన్ఫర్మ్ కాలేదు. పూర్వ వైభవం కోసం వెయిటింగ్ అలాగే సుడిగాలిని తీసుకురండి. జూన్ నుండి జబర్దస్త్ నెక్స్ట్ లెవెల్ ఆది అన్న వస్తున్నాడు . నాగబాబు గారు రాకతో, జబర్దస్త్ పూర్వ వైభోగంతో మెరిసిపోతోంది. చమ్మక్ చంద్ర కోసం వెయిటింగ్.. మార్పు మొదలైయింది. కామన్ మాన్ కి కామెడీ ఎంతో అవసరం. జబర్దస్త్ ఇప్పుడు విందు భోజనం పెడుతోంది.. టీం కి ధన్యవాదములు ..జూన్ కోసం వెయిటింగ్. జబర్దస్త్ కీ లైఫ్ వచ్చింది. 2018-2019 అలాంటి జబర్దస్త్ కావాలి." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




.webp)
.webp)
