నేను ఆమెను వేస్ట్ ఫెలో అంటాను.. ఆమె నన్ను హనీ అంటుంది!
on May 18, 2025
బుల్లితెర మీద ఇమ్మానుయేల్ కి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెర మీద రష్మీ-సుడిగాలి సుధీర్ జోడి ఎలా ఐతే ఆన్ స్క్రీన్ పెయిర్ గా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారో ఇమ్మానుయేల్ - వర్ష కూడా అలాంటి ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. మొదట్లో వచ్చిన షోస్ లో వీళ్ళిద్దరినీ చూస్తే గనక వర్ష ఐతే ఇమ్మును నిజంగా లవ్ చేస్తోందా అన్న ఫీల్ కలిగేది. అలాగే కోడలొస్తోంది అని మీ ఇంట్లో చెప్పు ఇమ్ము అని వర్ష అంటే అల్లుడొస్తున్నాడని మీ ఇంట్లో చెప్పు వర్ష అనుకునేవాళ్లు. ఐతే వీళ్ళు నిజంగా పెళ్లి చేసేసుకుంటారేమో అని కూడా అనుకున్నారు ఆడియన్స్. కట్ చేస్తే జబర్దస్త్ లో ఇమ్ము కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ మాకి వచ్చి సెటిల్ అయ్యాడు. ఇక్కడ షోస్ లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ వారం లవ్ థీమ్ లో తన లవ్ స్టోరీ చెప్పాడు.
"నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది..త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఇప్పుడు డాక్టర్ చదువుతోంది. మిడిల్ క్లాస్ ఫామిలీ. చాలా కష్టపడి చదివి స్కాలర్ షిప్స్ తెచ్చుకుని డాక్టర్ వరకు వచ్చింది. ఆమె కష్టపడిన గుణం నచ్చి నేను వెళ్లి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను. ఆమె కూడా ఒప్పుకుంది. ఆమె ఒప్పుకున్న రెండు రోజులకే మా ఇంట్లో ఆమెను పరిచయం చేసాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నీకు పిల్ల దొరకడమే ఎక్కువ అని అన్నారు. ఆమె నా షోస్ అన్ని చూస్తుంది. ఆమె చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. నేను ఆమె పేరు చెప్పను కానీ ముద్దుగా వేస్ట్ ఫెలో అని పిలుస్తాను..ఆమె నన్ను హనీ అని నాన్న అని పిలుస్తుంది. వేస్ట్ అమ్మ ఐ లవ్ యు..నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తావ్...ఏ తప్పు చేసినా నన్ను భరిస్తావ్. నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చావ్. థ్యాంక్యూ సో మచ్ " అని చెప్పాడు ఇమ్మానుయేల్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
