
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -993 లో..... రాజు ని చూసి రాజ్ బావ లాగా ఉన్నాడు ఏంటని రేఖ టెన్షన్ పడుతుంది. ఆ టెన్షన్ తో డ్రింక్ చేస్తుంది. అప్పుడే భ్రమరాంబ వస్తుంది. ఏంటి రేఖ నువ్వు ఐశ్వర్య ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళినప్పటి నుండి కంగారు పడుతున్నావ్ ఏంటని అడుగుతుంది. చనిపోయాడనుకున్న వాడు వస్తే ఎలా ఉంటుంది. మా అమ్మ తన చేతులతో రాజ్ బావని చంపేసింది కానీ ప్రొద్దున వచ్చిన అతను అచ్చం రాజ్ భావాలాగే ఉన్నాడు అలా ఎలా సాధ్యమని రేఖ అనగానే భ్రమరాంబ షాక్ అవుతుంది.
ఒకవేళ రాజ్ మేనల్లుడు స్వరాజ్ అయి ఉండొచ్చు అదే కనుక నిజం అయితే ఇన్నాళ్లు ఆస్తులు కోసం వేచి వున్నది వృధా అవుతుంది. వాడు వస్తే ఇప్పుడు ఆ ఇందుకి తోడుగా ఉంటే మనం ఏం చెయ్యలేమని రేఖ అంటుంది. ఆ తర్వాత రాజు నిద్రలో ఉల్లిక్కిపడి లేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ లక్ష్మి చూసి.. వీడేంటి ఇలా ప్రతీసారి నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నాడు. తనకి గతం గుర్తుకి వస్తుంది కావచ్చు .. మనం నిజం దాచి తప్పు చేసామా అని తన భర్తతో లక్ష్మీ అంటుంది. తన పేరెంట్స్ ఉంటే వెతుకుంటూ వచ్చేవాళ్ళు కదా అని లక్ష్మీ భర్త తనతో అంటాడు. ఆ తర్వాత రాజు గురించి తెలుసుకోవడానికి రేఖ తన మనిషిని జనాభా లెక్కల అధికారిగా రాజు ఇంటికి పంపిస్తుంది.
అతను అన్ని కనుక్కొని రేఖ దగ్గరికి వెళ్తాడు. అతను వాళ్ళ కొడుకే అంట మేడం.. చుట్టుపక్కన వాళ్ళు కూడా చెప్పారని అతను రేఖకి చెప్పగానే హమ్మయ్య వాడు స్వరాజ్ కాదన్న మాట అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఐశ్వర్య దగ్గరికి ఇందు వస్తుంది. రేఖ అంటి నీకు డబ్బు ఇస్తుంది కదా మరి ఎందుకు నెక్లెస్ తీసావ్.. అన్ని అప్పులు అయ్యయా అని ఇందు అడుగుతుంటే తనపై ఐశ్వర్య సీరియస్ అవుతుంది. మరొకవైపు వెంకీనీ అతని లవర్ ని కలపడానికి నందు హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






