
బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తానా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. రీసెంట్ గానే కొత్త కార్ కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. కార్ కొనుక్కుంది, లైఫ్ లో సెటిల్ అయిందని అంతా అనుకుంటున్న టైంలోనే ఊహించని ఘటన జరిగింది. ఇనాయ సుల్తానా ముక్కుకు దెబ్బ తగిలి బ్లడ్ వస్తున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఎవరు దిష్టి పెట్టారు రా అంటూ ఎమోషనల్ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇనాయ సుల్తానా పెట్టిన స్టోరీలో తన ముక్కు మీద గాయం అయి బ్లడ్ వస్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. రెండు ఫోటోలను పక్కపక్కనే పెట్టి ఎవరు దిష్టి పెట్టారు రా అని రాసుకొచ్చింది. దానికి Evil Eye అనే సాంగ్ ను కూడా యాడ్ చేసింది. దీంతో ఎవరో దిష్టి పెట్టడం వల్లే తనకు ఇలా జరిగిందని ఆమె భావిస్తున్నట్లు అర్థమవుతోంది. కొత్త కార్ కొన్న ఆనందంలో ఉండగానే ఇలా గాయం కావడంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ఏమైంది ఇనాయ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
బిగ్ బాస్ తర్వాత ఇనాయ సుల్తానా తన కెరీర్ పరంగా బిజీగా మారింది. సినిమా అవకాశాలు, ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే తన కష్టంతో కొత్త లగ్జరీ కార్ కొనుగోలు చేసింది. ఆ ఫోటోలను షేర్ చేసి తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది. అంతా బాగుంది, లైఫ్ సెటిల్ అయిందనుకుంటున్న టైంలోనే ఇలా దెబ్బ తగలడం అభిమానులను కలవరపెడుతోంది. చాలా మంది దిష్టి తగిలింది జాగ్రత్త అంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు.
ఇనాయ సుల్తానా ఎప్పుడూ తన లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. అందుకే తనకు దెబ్బ తగిలిన విషయాన్ని కూడా దాచుకోకుండా స్టోరీ పెట్టింది. అయితే ఈ గాయం ఎలా అయింది, ఇంట్లోనే తగిలిందా లేక ఎక్కడైనా పడిపోయిందా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కేవలం దిష్టి పెట్టారని మాత్రమే రాసుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. త్వరలోనే దీనిపై ఇనాయ పూర్తి వివరాలు చెప్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.






