Home

»

Tv News

హీరోగా ఇమ్మాన్యుయేల్ కొత్త ప్రయాణం.. ‘డెస్టినీ’ నుంచి బ్యూటిఫుల్ మెలోడీ రిలీజ్

Oct 31, 2026 6:47PM

జబర్దస్త్ కామెడీతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో ఆడియన్స్ ని అలరించిన  ఇమ్మూ.. ఈసారి రొమాంటిక్ హీరోగా కొత్త అవతారం ఎత్తుతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘డెస్టినీ’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్‌కు బుల్లితెరపై ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన ఆటతీరు, మాటతీరుతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. టైటిల్ విజేతగా నిలవకపోయినా తనదైన శైలిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు సినిమాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకోవడానికి  ప్రయత్నిస్తున్నాడు.

దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘డెస్టినీ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలో ‘ఓ పిట్ట కథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న చెందు ముద్దు.. ఈ చిత్రంతో ఇమ్మాన్యుయేల్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సత్యశ్రీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్  మరో అప్‌డేట్ ఇచ్చింది. సినిమాలోని ‘ఇద్దరి గుండెలపైనా’ అంటూ సాగే అందమైన మెలోడీ పాటను విడుదల చేసింది. ఈ పాటలో ఇమ్మాన్యుయేల్, సత్యశ్రీ  మధ్య కనిపించే రొమాంటిక్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, పాటలోని విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో మంచి  4 లక్షలకు పైగా  వ్యూస్‌తో సందడి చేస్తోంది.
------------

ఈ మెలోడీకి శ్రీరామ్ తపస్వి సాహిత్యం అందించగా, మారుతీ రాజా సంగీతాన్ని సమకూర్చారు. సాయి చరణ్ భాస్కరుణి, అభిఖ్య తణికెళ్ల తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఇక చంద్రకిరణ్ మాస్టర్ రూపొందించిన సింపుల్ డ్యాన్స్ స్టెప్పులు కూడా పాటకు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి.

ఇక ఈ సినిమాను కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నటి ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మారుతీ రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

బుల్లితెరపై కామెడీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ‘డెస్టినీ’పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తాజాగా విడుదలైన మెలోడీ పాటకు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి హీరోగా ఇమ్మాన్యుయేల్‌కు ‘డెస్టినీ’ ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com