Home

»

Tv News

విగ్గులపై ఇమ్మానుయేల్... రోహిణి కొప్పుపై అవినాష్ సెటైర్లు

Oct 28, 2026 11:40AM

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో  నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రిట్రో స్పెషల్ థీమ్ తో రాబోతోంది. లేడీస్ అంతా ఓల్డ్ స్టైల్ కాస్ట్యూమ్స్ లో వచ్చి సందడి చేశారు. ఇక రోహిణి సందడి మాములుగా లేదు. "నాకేమో రిట్రో థీమ్ అని చెప్పారు వీళ్లందరేమో స్టైల్ స్టైల్ గా ఉన్నారు. అంటే నేనొక్కదాన్నే ఫ్లవర్ అయ్యింది  " అంటూ కళ్ళజోడు పెట్టుకుని తెగ బాధపడిపోయింది. రోహిణి తల వెనక అలనాటి అందాల నటి వాణిశ్రీలా పెద్ద కొప్పు పెట్టుకొచ్చేసరికి అవినాష్ ఫుల్ కామెడీ చేసాడు. "షూటింగ్ లో వాళ్ళు ఫుడ్ పెట్టారు అనా లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు " అంటూ రోహిణి కొప్పు మీద సెటైర్ వేసాడు. దాంతో అందరూ నవ్వేశారు.

ఇమ్మానుయేల్ హరి స్టైల్ మార్చేసరికి శ్రీముఖి వెళ్లి "ఎం పెడుతూ ఉంటారేంటి జుట్టుకి " అని అడిగింది. "విగ్గు పెడుతూ ఉంటారు అంతే " అంటూ హరి సెటైర్ వేసాడు. తర్వాత శ్రీముఖి పక్కకు మానస్ వచ్చి నిలబడ్డాడు. వెంటనే శ్రీముఖి రియాక్ట్ అయ్యింది. "ఇక్కడికి వచ్చిన ప్రతీ పురుషుడు నన్ను చూడగానే చెమటలు కక్కుకుంటున్నారు " అని తెగ సిగ్గుపడిపోయింది. ఆ సెటైర్ కి ఇమ్మానుయేల్ కౌంటర్ వేసాడు.

"అవి మీ వలన వచ్చిన చెమటలు కావు. అలవాటు లేని ఈ విగ్గులు పెట్టుకోవడం వచ్చిన చెమటలు "అని చెప్పేసరికి అందరూ పగలబడి నవ్వారు. తర్వాత ఇమ్మానుయేల్ అమ్మా అంటూ రోహిణి  వెంటబడ్డాడు. అవినాష్ వచ్చి బాబు మీ అమ్మగారా అని ఇమ్మానుయేల్ ని అడిగేసరికి అవును అన్నాడు. మరి మీ నాన్నగారు అన్నాడు. వెంటనే రోహిణి డాక్టర్ బాబు దగ్గరకు వెళ్లి "ఏవండీ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లిపోయారండి" అంటూ తెగ కన్నీళ్లు కార్చింది. దాంతో డాక్టర్ బాబు షాకయ్యాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com