Home

»

Tv News

డీమన్ పవన్ మీద సీరియస్ ఐన ఇమ్మానుయేల్...ఎందుకంటే..!

Aug 10, 2026 2:59PM

రీసెంట్ గా రిలీజయిన బంగారం కవర్ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ సాంగ్ 1.5 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.
ఐతే ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా కూడా రీతూ - డెమోన్ కి విషెస్ చెప్పారు. అలాగే డెమోన్ పవన్ గురించి కూడా కొన్ని విషయాలను చెప్పాడు.  

 "రీతూ నా ఫ్రెండ్ ఐనప్పటికీ మనస్ఫూర్తిగా డెమోన్ పవన్ కోసం ఇక్కడికి వచ్చాను. నేను డెమోన్ గురించి 2 విషయాలు చెప్పాలి. మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం కొంత టైం తర్వాత వాళ్ళ నుంచి వేరే వాళ్ళ దగ్గరకు షిఫ్ట్ అవుతాం. వాళ్ళ నుంచి వేరే వాళ్ళ దగ్గరకు షిఫ్ట్ అవుతాం. కానీ డెమోన్ అలా కాదు వాడు ఒక్కసారి కలిస్తే మళ్ళీ షిఫ్ట్ అవడం అంటూ ఉండదు. వాడి దగ్గరే అతుక్కుపోయి ఉంటాం. అంత మంచోడు వాడు. అలాంటి మంచోడికి మంచి సక్సెస్ లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. ఈ సాంగ్ ని ప్రొడ్యూస్ చేసాడు అని తెలియగానే నాకు ఫస్ట్ కోపం వచ్చింది. ఏరా ఎందుకు చేసావ్ ఇప్పుడిప్పుడే కదా సంపాదించుకుంటున్నావ్. అమ్మను బాగా చూసుకోవాలి కదా ఎందుకురా ఇప్పుడు అని అడిగా. అప్పుడు ఒక్కటే చెప్పాడు మా నాన్న గుర్తుగా నేను ఏదో ఒకటి చేయాలి. అలా నాలా కొత్తగా వచ్చే టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి డి. పి . క్రియేషన్స్ అని స్టార్ట్ చేశాను. మా నాన్న కోసం ఇది చేస్తున్నాను అన్నా అన్నాడు. అది నాకు చాల హ్యాపీగా అనిపించింది. మా అమ్మ కడుపున పుట్టకపోయిన నా సొంత తమ్ముడిలాగే . డెమోన్ మంచిగా సక్సెస్ అవ్వాలి. పెద్ద హీరో అవ్వాలి. ఇదే స్క్రీన్ లో నీ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. " అని చెప్పాడు ఇమ్మానుయేల్.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com