Home

»

Tv News

ఎట్టకేలకు ప్రేమ మెడలో తాళి కట్టిన ధీరజ్.. కన్యాదానం చేసిన తిరుపతి, సుక్కూ!

Oct 1, 2026 11:35AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -593 లో....వల్లి కుట్రలన్నింటినీ నర్మద ఆధారాలతో సహా ప్రేమ ముందు బయటపెట్టడంతో ప్రేమ పంతాన్ని పక్కనపెట్టి ధీరజ్ తో పెళ్లికి ఒప్పుకుంటుంది. ప్రేమను పెళ్లి కూతురిలా రెడీ చేసి నర్మద మండపానికి తీసుకురాగా రామరాజు కళ్లల్లో ఆనందం నిండిపోతుంది.

అదే సమయంలో సేనాపతి, భద్రావతిలు పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ చేస్తారు. నా మేనకోడలిని మాయ చేసి తీసుకొస్తావా అని భద్రావతి అనగా తనంతట తానే వచ్చిందని రామరాజు కౌంటర్ ఇస్తాడు.  రామరాజు కాలర్ సేనాపతి పట్టుకోబోతే చందు, సాగర్ ఆపుతారు. అప్పుడే ప్రేమ..‌నాన్నా నేను నా ఇష్టప్రకారమే వచ్చాను, మామయ్య ప్రమేయం లేదు, అనవసరంగా నోరు జారకండి అంటూ తండ్రినే వారిస్తుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ప్రేమ అనడంతో సేనాపతి గుండె బద్దలవుతుంది.

నటించకు అత్తా, నువ్వేం చేశావో నాకు అన్నీ తెలిసిపోయాయి, చిన్నప్పటి నుంచి నిన్ను అమ్మలా చూశా.. కానీ నీ నిజస్వరూపం తెలిసింది.. ఇప్పటికీ నీ పరువు తీయలేను కాబట్టి వెళ్లిపోమని భద్రావతితో ప్రేమ అంటుంది. దీంతో భద్రావతి షాక్ అవుతుంది. శాస్త్ర ప్రకారం కన్యాదానం జరగకపోతే ఈ పెళ్లికి విలువ ఉండదు, కన్యాదానం ఎవరు చేస్తారని సేనాపతి సవాల్ విసురుతాడు. అప్పుడే తిరుపతి ముందుకొచ్చి.. ప్రేమ నాకు కూడా కూతురే, నా మేనల్లుడి కాళ్లు కడిగి మేము కన్యాదానం చేస్తామని అంటాడు.

ముహూర్తం మించిపోతుందని పంతులు చెప్పడంతో తిరుపతి, సుకన్య మేనల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు. అందరి సమక్షంలో ప్రేమ మెడలో ధీరజ్ తాళి కడతాడు. చిన్నప్పుడు గుండెల మీద తన్నితే మురిసిపోయా, ఇప్పుడు జీవితంలో కోలుకోలేనంతగా గుండెల మీద తన్నిందంటూ సేనాపతి గుండెలు పగిలేలా ఏడుస్తూ వెళ్లిపోతాడు. పెళ్లి అయ్యాక కొత్త జంటను ఇంటికి తీసుకొచ్చి అమూల్య, కామాక్షి హారతి ఇస్తారు. వల్లి కుట్రలు మామయ్య ముందు పెడతానని నర్మద వార్నింగ్ ఇవ్వడంతో వల్లి గజగజ వణికిపోతుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com