Home

»

Tv News

నర్మదని బ్రతిమాలిన వల్లి.. రామరాజుకి నిజం చెప్తుందా.!

Oct 3, 2026 9:56AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -595 లో.....ప్రేమ తన గది మొత్తం చూస్తూ.. తిరిగి నా సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాను..‌దిగులు అంతా పోయిందని ధీరజ్ తో చెప్తూ ఏడుస్తుంది. ధీరజ్ ఎమోషనల్ అయి ప్రేమని హత్తుకుంటాడు. రేయ్ ఇంతకు ముందులా కాదు, ఈసారి కొత్త ప్రయాణమేనని ప్రేమ అంటే.. ఏంటే నీ పుట్టింటికా? నీకు ఎప్పుడైనా పిచ్చి రేగొచ్చు, ఎప్పుడైనా వెళ్లిపోతావని ధీరజ్ అంటాడు. దానికి ప్రేమ.. ఇంతకు ముందులా కాదు..‌ మన బంధం ఇప్పుడు ఇంకా గట్టిగా ముడిపడింది, ఒకే ఊపిరిగా ఉందామని ధీరజ్ ని హగ్ చేసుకుంటుంది.

మరోవైపు వల్లీ గురించి నర్మద ఆలోచిస్తూ.. నీ బండారం బయట పెట్టే టైమ్ వచ్చేసింది వల్లీ అని అనుకుంటుంది. ఇక వల్లీ కూడా.. ఈ రోజుతో నా పని అయిపోతుందని టెన్షన్ పడుతుంది. వేదవతి అందరి కోసం భోజనం ఏర్పాటు చేస్తూ వల్లీని పిలుస్తుంది. వల్లీ, వేదవతి, అమూల్య అందరికి వడ్డిస్తారు. తర్వాత ధీరజ్ వాళ్లు వచ్చి ఆడవాళ్లని కూర్చోబెట్టి మగవాళ్లు వడ్డిస్తారు. నీ గవర్నమెంట్ కోడలు ఇంకా రాలేదు ఏంటని వేదవతిని రామరాజు అడుగుతాడు. సాగర్, నర్మదని పిలిచావా అంటే పిలిచానని వేదవతి అంటుంది. నర్మద వచ్చి రామరాజుతో విషయం చెప్పాలని అనుకుంటే అందరు బలవంతంగా నర్మదని తినడానికి కూర్చోబెడతారు. అందరు సంతోషంగా సెల్ఫీలు తీసుకుంటారు.

భోజనాల సమయంలో రామరాజు నర్మదతో.. ఈ ఆనందం మొత్తం నీదే అమ్మా, ఎలాంటి గొడవలు లేకుండా నా కుటుంబం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి.. ఇదే నా ఆశ అని చెప్తాడు. రామరాజు మాట విన్న తర్వాత నిజం చెప్పాలా వద్దా అని నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. నర్మదని చూసి వల్లి చాలా టెన్షన్ పడుతుంది. అందరు వెళ్లిపోయాక  నర్మద దగ్గరకు వల్లి వచ్చి దొంగ ఏడుపు ఏడుస్తుంది. తన గురించి చెప్పొద్దు, ఈసారికి క్షమించు, ధీరజ్, ప్రేమలకు నేను క్షమాపణ చెప్పుకుంటానని తెగ నటిస్తుంది. నేను నిన్ను అస్సలు క్షమించనని నర్మద అంటుంది. నేను బుద్ధిగా ఉంటా చెల్లాయ్, మారిపోయానని వల్లీ బతిమాలుతుంది.

దానికి నర్మద.. ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకో.. రేపు చూసుకుందామని అంటుంది. దీంతో వల్లీకి కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది. మరోవైపు ధీరజ్, సాగర్, చందు, తిరుపతిలు మందు తాగుతూ మాట్లాడుకుంటారు. తిరుపతి తనకి ఇంకా శోభనం అవ్వలేదని ఏడుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com