
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్- 611లో.. రాత్రి రోడ్డు పక్కన బ్యాగు పట్టుకుని కూర్చున్న శ్రీవల్లి దగ్గరకు ఓ తాగుబోతు వచ్చి అల్లరి చేస్తాడు. వల్లి రాయి ఎత్తి కొట్టబోతుంటే అప్పుడే ధీరజ్ కార్లో వచ్చి ఆ తాగుబోతును చితక్కొడతాడు. అర్ధరాత్రి ఇలా బ్యాగు పట్టుకుని కూర్చుంటే అత్తారింటోళ్లు తీసుకెళ్తారని మీ అమ్మ కొత్త డ్రామా ప్లాన్ చేసిందా అని ధీరజ్ అడిగితే. నువ్వు అనడంలో తప్పు లేదు ధీరజ్, నా జీవితమే ఓ డ్రామా అయిపోయింది. నేను చెప్పినా ఎవరు నమ్ముతారని వల్లి ఎమోషనల్ అవుతుంది. తప్పులు చేశానని మీరు గెంటేశారు. తప్పులు తెలుసుకున్నానని మా అమ్మ గెంటేసింది. మా ఆయనకు ఫోన్ చేస్తే చస్తే చావని అన్నాడు. ఇక ఎవరి కోసం బతకాలని ఏడుస్తుంది. దానికి ధీరజ్ నీ కోసం బతకాలి. ఇది నువ్వు చేసిన పాపాలకు శిక్ష.. కళ్యాణ్ విషయంలో నువ్వు ఎంత నరకం పెట్టావో నాకు తెలుసని అంటూ వల్లిని తీసుకుని వాళ్ల ఇంటికి బయలుదేరుతాడు.
మరోవైపు అర్ధరాత్రి విశ్వ అమూల్యకు కాల్ చేసి నిద్రపోతున్నావా అమూల్య అని అడుగుతాడు. దానికి అమూల్య అర్ధరాత్రి కాల్ చేసి మళ్లీ నిద్రపోతున్నావా అని అడుగుతావేంటని తిడుతుంది. నిద్ర రావడం లేదు కాసేపు మాట్లాడమని విశ్వ బతిమాలతాడు. ఇటు సుక్కు ధీరజ్ కి వల్లి కనిపించిందో లేదో అని టెన్షన్ పడుతుంటే తిరుపతి వచ్చి హగ్ చేసుకోవాలని ట్రై చేసి కింద పడిపోతాడు. అమూల్య వచ్చి ఏమైందని అడిగితే కాలు జారి పడ్డానని కవర్ చేస్తాడు. అర్ధరాత్రి ఫోన్లో ఎవరు అని సుక్కు అడిగితే ఫ్రెండ్ కి డౌట్ చెప్తున్నానని అమూల్య కవర్ చేస్తుంది. వల్లిలా నిన్నూ గెంటేయమంటావా అని తిరుపతి వార్నింగ్ ఇస్తాడు. ఉదయం కూతురు కోసం ఆనందరావు టెన్షన్ పడుతూ ఇంటి బయట తిరుగుతాడు. తెల్లారినా రాలేదని.. నీకు ఏమైనా బాధ ఉందా అని భాగ్యాన్ని అడిగితే అందరికి భాగ్యం లోకువ అయిపోయిందని అంటుంది. వల్లి తిరిగి వస్తే అప్పుడు అల్లాడిస్తానని బిల్డప్ ఇస్తుంది.
అప్పుడే వల్లిని తీసుకుని ధీరజ్ రావడంతో భాగ్యం, ఆనందరావు షాక్ అవుతారు. మాటలు జాగ్రత్త అని భాగ్యం వార్నింగ్ ఇస్తే తల్లివి ఇలా ఉన్నావ్ కాబట్టే కూతురిని అలా తయారు చేశావ్.. నువ్వు మనిషివేనా అని డౌట్ వస్తుందని ధీరజ్ ఫైర్ అవుతాడు. కామెడీ అయిపోతే ఆ మనిషిని తీసుకుని వెళ్లిపోమని భాగ్యం అంటే నీ కూతురిని ఇక్కడే ఉంచేందుకు వచ్చానని ధీరజ్ చెప్తాడు. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదని భాగ్యం అనగానే ఆ ప్రాణం తీసేస్తే అంటూ ఎస్ఐ ఎంట్రీ ఇస్తుంది. స్టేషన్ లో పెట్టి బెండు తీసేద్దాం. ఇలా జీవితాలతో ఆడుకునే వాళ్లకు మా స్టైల్లో కోటింగ్ ఇస్తే లైన్ లోకి వస్తారని సీరియస్ అవుతుంది. భాగ్యం అంటే ఒక బ్రాండ్.. దడదడలాడిస్తా అని ఓవరాక్టింగ్ చేస్తే ఎస్ఐ గన్ తీసి ఆనందరావు లుంగీపై కాల్చి దడదడలాడించడం అంటే ఇదేనా అని అడుగుతుంది. దెబ్బకు భయపడిన భాగ్యం.. మీరు ఏదంటే అదే అంటూ వల్లిని దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్తుంది. ప్రతి ఉదయం, సాయంత్రం వచ్చి చెక్ చేస్తా, తేడా వస్తే తాట తీస్తానని ఎస్ఐ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. చివర్లో వల్లిని గెంటేసిందంటే నమ్మలేమని వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
