Home

»

Tv News

Illu Illalu pillalu :ఘనంగా ప్రేమ, ధీరజ్‌ల పెళ్లి.. రామరాజు ఇంట్లో సందడి.!

Oct 2, 2026 10:26AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -594 లో.....తిరుపతి, సుక్కు ధీరజ్ కాళ్లు కడిగి కన్యాదానం చేయడంతో అందరు సంతోషంగా రామరాజు ఇంటికి వస్తారు. కామాక్షి, అమూల్య కలిసి ప్రేమ, ధీరజ్ లకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అయితే తిరుపతిని మోసం చేసి పెళ్లి చేసుకుందనే కారణంతో సుక్కూని ఇంట్లో నుంచి గెంటేస్తుంది వేదవతి. నేను మీరు చెప్పినట్టే వింటాను.. చెప్పినట్టే నడుచుకుంటానుమ. నా ప్రవర్తన మీకు నచ్చకపోతే నన్ను ఎప్పుడైనా బయటకు పంపేయండి అని వేదవతి, రామరాజుల వద్ద సుకన్య ప్రాధేయపడటంతో రామరాజు ఇద్దరిని ఇంట్లోకి రమ్మంటాడు.

వేదవతి ప్రేమని దగ్గరకు తీసుకుని.. అమ్మా ప్రేమా, మీ కాపురం చల్లగా ఉండాలని, మీరిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, నీలో ఆ మొండితనం మెల్లగా తగ్గాలని దండం పెట్టుకుని దీపం వెలిగించమని అంటుంది. దానికి ప్రేమ.. నాకు మొండితనం తగ్గడం కాదు, మీ ముద్దుల కొడుక్కు పనికిమాలిన ఆవేశం, దిక్కుమాలిన కోపం తగ్గాలని అంటుంది. ఏయ్ నాకు కోపమా, నాకు ఆవేశమా, నేను ఎప్పుడైనా అరవడం చూశావా అంటూ గట్టిగా అరుస్తాడు ధీరజ్. నరాలు చిట్లి తెగిపోయేలా ఊగిపోయావని ప్రేమ అనడంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలవుతుంది. రేయ్ దండం పెడతాను ఆపండ్రా, ఇప్పుడే కళ్యాణమండపం నుంచి వచ్చామని వేదవతి వారిని ఆపుతుంది. ఆ తర్వాత ప్రేమ పాట వేసుకుని.. అత్తయ్యా మా అత్తవారింటికి నేను తిరిగొచ్చేశాను అంటూ చీర చెంగులు చుట్టుకుని నట్టింట్లో డాన్స్ చేయడంతో రామరాజు, ధీరజ్ తో సహా అందరూ డాన్స్ చేస్తారు.

మరోవైపు తన గదిలో ప్రేమ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ కోపంతో రగిలిపోతుంది భద్రావతి. సేనాపతి "అక్కా" అని పిలవడంతో "వద్దు, మీరెవరూ నాకు ముఖం చూపించొద్దు.. వెళ్లిపోమని అరుస్తుంది. ఓడిపోతున్నానురా, పాతికేళ్లుగా ఆ రామరాజు ముందు ఓడిపోతూనే ఉన్నాను..పాతికేళ్ల క్రితం నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా మేనకోడల్ని పోగొట్టుకున్నాను.. అప్పుడు కేవలం వేదవతి దృష్టిలోనే రాక్షసిని, ఇప్పుడు నా మేనకోడలికి కూడా శత్రువును అయిపోయానని బాధపడుతుంది. ఆ రామరాజుని దెబ్బకొట్టి, వాడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి వాడిని నడిరోడ్డున నిలబెట్టే వరకు ఈ గదిలో నుంచి బయటకు రానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అక్కా అని ధైర్యం సేనాపతి చెప్తాడు.

ఇక చింతామణి చేతిలో దెబ్బలు తిన్న ఇడ్లీ, భాగ్యం చేత సేవలు చేయించుకుంటుంటాడు. సుక్కు, వల్లి కలిసి భాగ్యంకి కాల్ చేసి.. మండపంలో కాళ్లు కడిగాము.. ఇక్కడ ఇంట్లో కాలు పెట్టాం.. ఇక మర్రిచెట్టులా పాతుకుపోయినట్టే అని అంటుంది సుక్కు. ఆ ఇంట్లో చెలరేగి దూసుకుపోండి అని భాగ్యం అంటుంది. వల్లి మాత్రం.. నా బండారం మా మామయ్యగారి ముందు బయటపెడతానని నర్మద వార్నింగ్ ఇచ్చింది.. దాని నెక్స్ట్ స్టెప్ ఏంటో అని భయంగా ఉందని అంటుంది. దీంతో భాగ్యం వల్లికి మరో కొత్త ప్లాన్ చెప్తుంది. చివర్లో శారదాంబ, రేవతిలు ప్రేమకి.. బుద్ధిగా కాపురం చేసుకో, త్వరలో వారసుడిని ఇవ్వాలని సలహాలు ఇస్తారు. దీనికి అసలే మెంటల్, క్రాక్, జాగ్రత్తలు నాకు చెప్పాలని ధీరజ్ అనడంతో ప్రేమ మొట్టికాయ వేస్తుంది. గదిలోకి వెళ్లిన ప్రేమ తన గిఫ్ట్ చూస్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Illu Illalu Pillalu Today October 1st Episode, Prema Dheeraj Marriage, Vedavathi Ramaraju, Bhadravathi Revenge]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com