
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -603 లో .. రామరాజు తన పెద్ద కొడుకు జీవితం నాశనం చేశానని కుమిలిపోతుంటే అదే రోజు నర్మద, సాగర్ ల పెళ్లి రోజు రావడంతో నర్మద తల్లిదండ్రులు రామరాజు ఇంటికి వస్తారు.
రామరాజు వేదవతితో తన బాధను చెప్పుకుంటాడు. నా పెద్ద కొడుకు జీవితం ఇలా అయిపోయిందన్న బాధను ఎలా మర్చిపోగలను.. ఒక సంబంధం చూసి వెనక ముందు ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసినందుకు వాడి దృష్టిలో నేను చేతకాని తండ్రినే కదా అంటూ ఎమోషనల్ అవుతాడు. వాళ్లు బాగా కబుర్లు చెప్పి మంచోళ్లు లేరు అన్నట్టు నమ్మించారని.. పెద్ద బంగ్లా చూపించి తమదే అని నమ్మించారని.. అలాంటి వాళ్లు మోసం చేస్తారని ఎవరు అనుకోరని వేదవతి ఓదారుస్తుంది. పెద్దోడు మోసపోయాడే తప్ప మోసం చేసినోడు కాదు.. దేవుడు కచ్చితంగా మంచి చేస్తాడని ధైర్యం చెప్తుంది.
అదే సమయంలో శారదాంబ మాట్లాడుతూ ఉండగా నర్మద తల్లిదండ్రులు ప్రసాద్ రావు, సుజాత ఇద్దరు రామరాజు ఇంటికి వస్తారు. మళ్లీ ఏం చేయడానికి వచ్చారు మహానుభావులు అంటూ రామరాజు వెటకారంగా మాట్లాడతాడు. దీనికి ప్రసాద్ రావు.. మా అల్లుడికి, కూతురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చామని చెప్తాడు. ఈ రోజు మీ పెళ్లి రోజని చెప్పలేదేంటి అని నర్మదను ప్రేమ అడుగుతుంది. అందరు నర్మద, సాగర్ లను విష్ చేస్తారు.
అప్పుడు ప్రసాద్ రావు ఎమోషనల్ అవుతాడు. మేం కాదన్నా పెళ్లి చేసుకున్నారు.. మీ జీవితం ఎలా అవుతుందోనని భయపడ్డాం కానీ మీ వెనుక గొప్ప కుటుంబం ఉందని నిరూపించారు.. మా కళ్లు తెరిపించారు.. ఇన్ని రోజులు కూతురిని దూరం పెట్టి తప్పు చేశామని తెలిసొచ్చిందంటూ క్షమాపణ అడుగుతాడు. ఇక నర్మద తల్లి సుజాత ఒక మాట చెప్తుంది. ఈ రోజు గుడిలో పూజ చేయించాం.. ఐదుగురు ముత్తైదువులతో ఆశీర్వాదం ఇప్పిస్తే మా అమ్మాయి కడుపు పండుతుందని పూజారి చెప్పారని.. మీకు ఇబ్బంది లేకపోతే ఆ తంతు జరిపిస్తామని రామరాజు, వేదవతిని అడుగుతుంది.
దీనికి నర్మద వద్దమ్మా వద్దు.. ఇప్పుడు అలాంటివి వద్దు.. ఇంట్లో పరిస్థితి బాగోలేదని అంటుంది. కానీ రామరాజు ఎవరి కోసమో మీ సంతోషాన్ని కోల్పోవద్దు.. నువ్వు మా కుటుంబం కోసం పుట్టింటికి దూరమయ్యావ్.. ఇప్పుడు సంతోషాన్ని కూడా దూరం చేసుకోవద్దని చెప్పి ఒప్పిస్తాడు. ఇక మరోవైపు ఈ పెళ్లి రోజు సెలబ్రేషన్ నే అడ్డం పెట్టుకుని వల్లి భద్రావతి ప్లాన్ వేస్తారు. సుక్కు వల్లికి ఫోన్ చేసి ఇక్కడ నర్మద, సాగర్ వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతోంది. ఈ ఈవెంట్ ను అడ్డం పెట్టుకుని ఇంట్లోకి రీఎంట్రీ ఎలా ఇవ్వాలో ప్లాన్ చేసుకోమని చెప్తుంది. ఆ మాటలు తిరుపతి వినేస్తాడు. దీంతో భద్రావతికి ఇదే బ్రహ్మాస్త్రంలా మారుతుంది. మరి నర్మద పెళ్లి రోజు నాడు వల్లి ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO Keywords:





.webp)
