.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -615 లో.....రామరాజు స్థలం అమ్మకం చుట్టూ హైడ్రామా నడిచింది. వస్తాడు నా మొగుడు ప్రేమ అని పాటలు పాడుతూ 30 లక్షల టెన్షన్ లో ఉండగా ధీరజ్ ఐస్ క్రీం తెస్తాడు. ప్రేమ దాన్ని 30 లక్షలు అనుకుని.. భద్రావతి ఇంటికి వెళ్లి నీ సంగతి తేలుస్తా అని భారీ డైలాగ్స్ చెబుతుంది. డైలాగ్స్ ప్రాక్టీస్ లో ఐస్ క్రీం కరిగిపోతుందని ధీరజ్ అంటాడు. ముప్పై వేలే దొరకట్లేదు, బయట 3,5 రూపాయల వడ్డీ నడుస్తోందని బాధ చెప్తాడు .
మరోవైపు అమూల్య .. విశ్వక్ నా మైండ్ నుంచి డిలీట్ చేయాలని మెడిటేషన్ చేసినా మళ్లీ గుర్తొస్తాడని బాధపడుతుంది. వల్లీ చేతులకు కట్లు కట్టి ఉన్నా తీసేసి బయటకు వచ్చి.. అంతా చేతులారా చేసుకుని ఇప్పుడు నాకు ఎవరూ లేరని ఏడుస్తుంది.
రామరాజు ఇంటికి నాగరాజు రాగా.. నిన్న ల్యాండ్ అమ్మాలి అన్నారు కదా అని అంటాడు. వేదవతి బీరువాలో ఉన్న కాగితాలు అమూల్య తెస్తుంది. అప్పట్లో కూతుళ్ల పెళ్లి కోసం భూములు అమ్మేవారు, ఇప్పుడు కొడుకుల కోసం అమ్మాలని రామరాజు అంటాడు. ధీరజ్ కి 30 లక్షలు, సాగర్ కి 20 లక్షలు.. మొత్తం 50 లక్షలు కావాలి కాబట్టి అమ్ముతున్నామని వేదవతి చెప్తుంది . ధీరజ్, సాగర్ ఇద్దరూ.. మా కోసం అమ్మొద్దు, మేము తీసుకోమని అంటారు. చిన్నోడిపై నమ్మకం ఉంది, పెద్దోడు ఏ దొంగదారిన డబ్బు తెస్తాడో అని భయమని రామరాజు అంటాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని నర్మద అంటుంది.
చివర్లో భద్రావతి, సేనాపతి రామరాజు, వేదవతి సరదాగా నవ్వుకోవడం చూసి రగిలిపోతారు. భద్రావతి.. ఎన్నేళ్లయినా పగ తీర్చుకోలేకపోతున్నాం, వాడి కుటుంబం వాడికి బలం కాదు బలహీనత అని నిరూపిస్తా, ట్రావెల్స్ విషయంలో ధీరజ్ ని కోలుకోలేని దెబ్బ కొట్టి ధీరజ్ అనే పిల్లర్ కూల్చేసి కుటుంబాన్ని కూల్చేస్తానని శపథం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
