Home

»

Tv News

Illu Illalu Pillalu: భద్రావతిని రెచ్చగొట్టిన ప్రేమ.. అత్తాకోడళ్ళ మధ్య పోటీ!

Oct 23, 2026 7:27PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-612లో నర్మద, ప్రేమ, ధీరజ్, వేదవతి వల్లీ, భాగ్యం గురించి మాట్లాడుకుంటూ ఉండగా చందు వచ్చి వాళ్లంతా ఒకటే అని అంటాడు. రామరాజు వచ్చి ఆ దొంగల ముఠా ప్రస్తావన వద్దని చెప్తాడు. ఆ తర్వాత రామరాజు, చందు రైస్ మిల్లుకు వెళ్తుండగా ధీరజ్, ప్రేమ వేలంపాటకు వెళ్తామని చెప్తారు. నర్మదను కూడా రమ్మంటే వేదవతి నేను వస్తానంటే ప్రేమ వద్దు అత్తా అని అంటుంది. నువ్వు వస్తే కొడుకు మీద ప్రేమతో ఎంత డబ్బైనా పెట్టిస్తావ్.. నేను ఆచితూచి పాడుతానని ప్రేమ చెప్తుంది.

 

వేలంపాట దగ్గర ధీరజ్, ప్రేమ 12 లక్షల వరకే బడ్జెట్ అనుకుంటారు. పాట 10 లక్షల నుంచి మొదలై 13 లక్షలకు వెళ్లగానే ప్రేమ ఆపేద్దామంటే ధీరజ్ 14 లక్షలకు పాడుతాడు. సరిగ్గా అప్పుడే భద్రావతి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా 20 లక్షలకు పెంచేస్తుంది. ప్రేమను తీసుకుని వెళ్లిపోదామని ధీరజ్ అనుకుంటుండగా భద్రావతి.. కోటలో యువరాణికి పల్లకీ మోసేవాడు దొరికితే ఇలాగే ఉంటుందని ధీరజ్ ని అవమానిస్తూ రెచ్చగొడుతుంది.

 

దీంతో ప్రేమ రగిలిపోయి.. నా మొగుడ్ని అవమానిస్తే దేవుడ్ని కూడా వదలనని చెప్పి 21 లక్షలు పాడుతుంది. అక్కడి నుంచి అత్తా కోడళ్ల మధ్య పోటీ మొదలవుతుంది. భద్రావతి 22 లక్షలు అంటే ప్రేమ 23 లక్షలు, భద్రావతి 25 లక్షలు అంటే ప్రేమ 26 లక్షలు, చివరికి భద్రావతి 30 లక్షలు అనగానే ప్రేమ తగ్గకుండా 30 లక్షల ఒక్క రూపాయికి గెలుస్తుంది. కత్తి కామెడీతో ఒక్క రూపాయి ఇచ్చే సీన్ కూడా నవ్వు తెప్పిస్తుంది. చివర్లో.. నా భర్తను ఎవరి ముందు తగ్గించను.. గెలిపించానని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం‌ జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com