Home

»

Tv News

Illu Illalu pillalu : నర్మద చూపించిన సాక్ష్యాలతో పెళ్లికి ఒప్పుకున్న ప్రేమ.. భద్రావతికి షాక్!

Sep 30, 2026 10:00AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 592 లో..... చింతామణికి మెలకువ వచ్చి భాగ్యం, ఆనందరావుని పట్టుకుని.. నాకు 6 లక్షలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ కొట్టేయడానికి దొంగతనానికి వస్తారా అని నిలదీస్తుంది. ఈ మాటలను నర్మద వింటుంది. రైస్ మిల్లులో డబ్బు నొక్కేసి తిరుపతి బాబాయ్ మీద నెట్టేస్తారా.. మీ సంగతి చెప్తానని నర్మద అనుకుంటుంది. మత్తులో ఉన్న వల్లీ మాత్రం.. డబ్బు కోసం రాలేదు, ప్రేమని కిడ్నాప్ చేయడానికి వచ్చామని నిజం చెప్పేస్తుంది. దీంతో చింతామణి ముగ్గురికీ ఒక్కటిస్తుంది.

 

మరోవైపు భద్రావతి సేనాపతితో తన బాధను చెప్పుకుంటుంది. వేదవతి పేరుకే నా చెల్లెలు, కానీ అది నా కూతురు, నా గుండె చప్పుడు. అంత ప్రాణమైన చెల్లెలు ఇంట్లో పనివాడితో వెళ్లిపోతే నా ప్రాణమే పోయింది. ఆ దుఃఖంతో పాతికేళ్లుగా కాలిపోతున్నా. నా మేనకోడలి రూపంలో ఇంకో బాధ వచ్చింది. ఆ రోజు చెల్లెల్ని వెనక్కి తెచ్చుకోలేక ఓడిపోయాను, ఈసారి ప్రేమ విషయంలో ఓడకూడదని నిర్ణయించుకున్నానని అంటుంది. ప్రేమ, ధీరజ్ పెళ్లి చేయాలని రామరాజు చేసిన ఛాలెంజ్ లో వాడు ఓడిపోయే టైమ్ వచ్చిందని సేనాపతి అంటాడు. ఇంతలో ప్రేమని పెళ్లి మండపానికి తీసుకెళ్లారని చింతామణి మనిషి ఫోన్ చేయడంతో భద్రావతి షాక్ అవుతుంది.

 

పెళ్లి మండపంలో ప్రేమ రెడీ అవ్వకుండా ధీరజ్ నే చూస్తూ కూర్చుంటుంది. అందరు ఎంత చెప్పినా వినదు. నేను ఈ పెళ్లి చేసుకోనని ప్రేమ అందరికి షాక్ ఇస్తుంది. పెళ్లి చేసుకోను అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావని వేదవతి అడిగితే.. వాడి కోసం వచ్చా, నేను పెళ్లి మండపానికి రాకపోతే జీవితంలో నా ముఖం చూడను అన్నాడు. వాడి ముఖం చూడకుండా ఉండలేనని అంటుంది. ఇంతలో నర్మద అక్కడికి వచ్చి.. నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావ్, నీతో మాట్లాడాలని ప్రేమని పక్కకు తీసుకెళ్లబోతుంటే రామరాజు ఆపి.. మనసులు కలవని పెళ్లి నిలబడదు, ప్రేమకి ఇష్టం ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుందని అంటాడు. ధీరజ్ కూడా.. ప్రేమకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి వద్దని పందిరి దిగిపోతాడు.

 

నర్మద ప్రేమని పక్కకు తీసుకెళ్లి అసలు నిజాలు, సాక్ష్యాలు చూపిస్తుంది. నువ్వు చాలా చైల్డిష్ గా ప్రవర్తిస్తున్నావ్, ధీరజ్ నీ కోసం చాలా సహనంగా ఉన్నాడు. మీ ఇద్దరినీ విడదీయడానికి కారణం మీ అత్తే, కళ్యాణ్ విషయం తీసుకొచ్చి ధీరజ్ నోరు జారేలా చేసింది మీ అత్తే. మీకు మోపి దేవి రమ్మంది ఒరిజినల్ ఎస్ఐ కాదని వల్లీ పేరెంట్స్ వెళ్లడం, కుట్ర మొత్తం వీడియో సాక్ష్యాలతో సహా చూపిస్తుంది. భద్రావతి, వల్లీ చేసిన కుట్ర తెలియడంతో ప్రేమ మైండ్ బ్లాక్ అయి పెళ్లికి ఒప్పుకుంటుంది. నర్మద ప్రేమని పెళ్లి కూతురిలా రెడీ చేసి తీసుకొస్తుంది. అందరూ హ్యాపీ అవుతారు. చివర్లో భద్రావతి, సేనాపతి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

Illu Illalu Pillalu Today Episode September 29, Illu Illalu Pillalu Serial Prema Marriage, Illu Illalu Pillalu Narmada Twist

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com