Home

»

Tv News

Illu Illalu pillalu :ప్రేమని కిడ్నాప్ చేయమని వల్లీ గ్యాంగ్ కి నర్మద ఆర్డర్!

Sep 27, 2026 9:21AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -590 లో......ధీరజ్ ని అందరు పెళ్లి కొడుకులా రెడీ చేస్తారు. కానీ ధీరజ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. దీన్ని గమనించిన వేదవతి.. చిన్నోడా ఇందాక నుంచి గమనిస్తున్నా, మేమంతా ఇంతలా మాట్లాడుతున్నా నువ్వు వేరే లోకంలో ఉన్నావ్.. ప్రేమ వస్తుందో రాదో అనేనా?" అని అడుగుతుంది. దానికి ధీరజ్.. ప్రేమ కచ్చితంగా వస్తుంది అమ్మా, నా మీద తనకున్న ప్రేమ తనని వచ్చేలా చేస్తుంది, ఒకవేళ పంతానికి పోయి వాళ్ల అత్త, నాన్న మాట విని రాకపోతే జీవితంలో నా మొహం దానికి చూపించనని తెగేసి చెప్తాడు. దీనికి వల్లీ.. అయితే ప్రేమ ఈరోజు రాకపోతే మామయ్యగారి ఛాలెంజ్ ప్రకారం ప్రేమ శాశ్వతంగా వెళ్లిపోతుంది కదా అని సంబరపడితే వేదవతి.. నీ నోటినుంచి ఒక్క మంచి మాట కూడా రాదా అని ఫైర్ అవుతుంది.

ఇంతలో వేదవతి తల్లి శాంతమ్మ వస్తుంది. ప్రేమ ఇక్కడే ఉంటే మీరు తీసుకొచ్చేస్తారని ప్రేమని ఆ చింతామణి ఇంటికి తీసుకెళ్లిపోయారని చెప్తుంది. దీంతో అందరు షాక్ అవుతారు. చందు, సాగర్ వెళ్లి తీసుకొద్దామని వెళ్తుంటే ధీరజ్ ఆపేస్తాడు. ప్రేమ నాకోసం రావాలి అనుకుంటే సప్త సముద్రాలు అవతల ఉన్నా వచ్చేస్తుందని అంటాడు. ఇంతలో రామరాజు వచ్చి ప్రేమ మండపానికి వస్తుందా అని అడగ్గా నేను తీసుకొస్తానని చెప్పి నర్మద అందరిని మండపానికి పంపిస్తుంది. వల్లీని మాత్రం.. కారులో ఖాళీ లేదు, మనం కలిసి వెళ్దామని జుట్టు పట్టి లాగుతుంది.

మరోవైపు చింతామణి ఇంట్లో ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఈ పెళ్లికి వెళ్లకపోతే ధీరజ్ జీవితంలో నా ముఖం చూడడా, ఏంటి దేవుడా నాకు ఈ పరీక్ష.. పుట్టిల్లు, అత్తారిల్లు ఎవరికి సపోర్ట్ చేయాలని కన్నీళ్లు పెట్టుకుంటుంది. చింతామణి వచ్చి.. నీ భర్త నీ కాలి దగ్గరకు రావాలి.. మగాడి తోడు లేకుండా ఆడది ఉంటుందని బ్రెయిన్ వాష్ చేస్తుంది. అసలు చింతామణి తన కూతురి పెళ్లి కాకుండా చేసినందుకు ధీరజ్ పెళ్లి జరగనివ్వకూడదని ప్లాన్ వేసుకుంటుంది.

ఇక నర్మద అసలు ట్విస్ట్ ఇచ్చింది. వల్లీ, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ లను చింతామణి ఇంటికి తీసుకొచ్చి.. వెళ్లి ప్రేమని తీసుకురండి అని చెప్తుంది. వాళ్లు.. మా వల్ల కాదు అని అంటే.. రమ్మంటే రాదు, కిడ్నాప్ చేసి తీసుకురండి, మీరు ఇలాంటి పనుల్లో ఎక్స్పర్ట్స్ కదా అని ఆర్డర్ వేస్తుంది.  ముసలి వాళ్లం చేయలేమని భాగ్యం అంటుంది. మోపిదేవి వెళ్లి మరీ వాళ్లని విడదీశారు కదా, దానికే ఇది ప్రాయశ్చిత్తం, తీసుకురాకపోతే వల్లీ చేసిన పనులన్నీ సాక్ష్యాలతో మామయ్యకి, చందు బావకి చెప్పేస్తానని నర్మద బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీంతో భయపడి వల్లీ గ్యాంగ్ ప్రేమను కిడ్నాప్ చేయడానికి వెళ్తుంది. మరోవైపు పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి తంతు మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



[Illu Illalu Pillalu Today Episode September 26, Illu Illalu Pillalu Serial Latest Episode, Illu Illalu Pillalu Prema Kidnap, Illu Illalu Pillalu Dheeraj Marriage]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com