.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -601 లో...... రామరాజు కుప్పకూలిపోయి నిన్ను ఎంతో నమ్మాను అమ్మా అంటూ బాధపడతాడు. వెంటనే వాళ్ల అమ్మానాన్నల్ని పిలిపించండి అని చెప్తాడు, సుకన్య ఫోన్ చేసి పిలుస్తుంది. సాగర్ చందుతో ఇన్ని రోజులు బాధ మనసులోనే మోశావా అని అడుగుతాడు. నా బాధ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని అనిపించలేదని చందు అంటాడు. కామాక్షి వచ్చి ఇంత మోసమా ఇంత అన్యాయమా అంటూ వల్లీని నిలదీస్తుంది. రోల్డ్ గోల్డ్ కట్నం విషయంలో మోసం చేశారని ఫైర్ అవుతుంది. దీంతో ఇంట్లో పెద్ద గొడవ మొదలవుతుంది.
భాగ్యం, ఆనందరావు పరుగున వచ్చి శుభవార్తా అని అడుగుతారు. మీ అమ్మాయి ఏం చదువుకుందని రామరాజు అడగ్గా ఎంఏ ఇంగ్లీష్ అని ఆనందరావు చెప్తాడు. సర్టిఫికెట్ ఫేక్ అని తెలియడంతో ఆనందరావుని రామరాజు లాగిపెట్టి కొడతాడు. చదువు ఒక్కటే కాదు మీ బండారం మొత్తం తెలిసిందని వేదవతి అంటుంది.
వంద అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు కదా అందుకే చేశామని భాగ్యం అంటుంది. మెడ పట్టి గెంటేయండని కామాక్షి అనడంతో వేదవతి బయటకు నడవమంటుంది. తప్పు చేసిన వాళ్లు ఉండకూడదంటే మీ కొడుకులు, కూతురు కూడా ఉండకూడదని భాగ్యం ఎదురు తిరుగుతుంది. రెండో కొడుకు లేపుకెళ్లి పెళ్లి, చిన్నోడు దొంగచాటు పెళ్లి, అమూల్య లేచిపోయిందని లెక్క చెప్తుంది. చివర్లో వల్లీ రామరాజు దగ్గరకు వెళ్లి కావాలని తప్పు చేయలేదని క్షమించమంటుంది. దానికి రామరాజు ఎమోషనల్ అవుతూ నిన్ను దేవత అనుకున్నానని అంటాడు.
లాకర్ తాళాలు కూడా నీ చేతిలో పెట్టాను.. నమ్మకాన్ని మోసం చేశావా అని ప్రశ్నిస్తాడు. అమూల్య భవిష్యత్తును విశ్వ చేతిలో ఎందుకు పెట్టావని నిలదీస్తాడు. పొరపాటు క్షమించొచ్చు కానీ మోసాన్ని కాదని తేల్చి చెప్తాడు. నిన్ను ఇంట్లో ఉంచుకోవడం పామును పెట్టుకోవడమే అని చందు అంటాడు. మీ అమ్మాయిని తీసుకెళ్లిపోండి అని రామరాజు ఫైనల్ తీర్పు ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
