.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -600 లో......వేదవతి వల్లీతో నీకు పిల్లలు పుట్టడం లేదని నా కొడుకు హింసించాడా అని అడుగుతుంది. ఏంటి బుజ్జమ్మా నువ్వు వాడు ఎంత ఇబ్బంది పెట్టకపోతే ఒక ఆడపిల్ల ఇలా నాతో తన బాధ చెప్పుకొని ఏడుస్తుంది చెప్పు అని రామరాజు అడుగుతాడు. మీరు ఉండండి అని వేదవతి వల్లీని నిలదీసి కొడుతుంది. దీని గురించి మీకు తెలీదు, దీన్ని ఏం చేసినా పాపం లేదు.. నీ పాపాలు అన్నీ క్షమిస్తున్నాం కదా.. నీ నిజస్వరూపం తెలిసిన రోజే నిన్ను మీ పుట్టింట్లో వదిలేయాలని అనుకున్నా కానీ చచ్చిపోతానని బావిలో దూకావ్.. ఒక్క అవకాశం ఇవ్వండి అని కాళ్లు పట్టుకొని బతిమాలితే క్షమించాను.. కానీ చివరకు నా కొడుకు మీదే నిందలు వేస్తావా అని వేదవతి కొడుతుంది.
వల్లీ ఎందుకు బావిలో దూకింది.. ఏ విషయం నాకు చెప్తే చచ్చిపోతా అంది.. తన మోసాలు, కుట్రలు ఏంటని రామరాజు నిలదీస్తాడు. అందరు కలిసి నన్ను పిచ్చోడిని చేస్తున్నారా.. పెద్దోడా చెప్పరా అని రామరాజు అడుగుతాడు. దాంతో చందు ఏడుస్తూ తండ్రిని వాటేసుకుంటాడు. నాన్న ఆ శివయ్య గొంతులో విషాన్ని దాచాడు.. నేను ఇక్కడ ప్రతీక్షణం ప్రాణం పోతున్నట్టు నరకాన్ని మోశాను. నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పలేకపోయా.. నువ్వు అనుకున్నంత అందంగా నా జీవితం లేదు నాన్నా అంటూ చందు బాధపడతాడు.
నాన్నా ఇది వాళ్ల అమ్మ, బాబు కలిసి మన కుటుంబాన్ని నిలువునా ముంచేశారు. అబద్ధాలు నాటకాలతో నమ్మించి మోసం చేశారని చందు చెప్తాడు. పెళ్లి టైంలో వీళ్లు కోటీశ్వరులని, పెద్ద ఫైనాన్స్ వ్యాపారం చేస్తారని చెప్పారు కదా అందంతా అబద్ధం నాన్న, వీళ్ల నాన్న సైకిల్ పైన ఇడ్లీలు అమ్ముతాడు..ఇది ఎంఏ ఇంగ్లీష్ చదివా అంది కదా పదో తరగతి కూడా పాస్ అవ్వలేదు.. పెళ్లి ఖర్చులు కూడా నాతో పది లక్షలు అప్పు చేయించిందని చందు బయటపెడతాడు.
ఇక నర్మద, ప్రేమ, ధీరజ్ ఇలా అందరు వల్లీ కుట్రలు ఒక్కొక్కటి రామరాజుకి చెప్పేస్తారు. ప్రెగ్నెన్సీ నాటకం, స్వీపర్ తో నర్మద వల్లే కడుపు పోయిందని చెప్పించడం, కేజీల బంగారం పుట్టింటి నుంచి వచ్చిందని చెప్పి గిల్టు నగలు పెట్టడం.. ప్రేమ నగలు కొట్టేసి ఆ స్థానంలో గిల్ట్ నగలు ప్రేమ పుట్టింటికి పంపడం. విశ్వని అమూల్య ప్రేమించేలా చేసి కిడ్నాప్ చేయడం..మోపిదేవి వెళ్లి ధీరజ్, ప్రేమల పెళ్లి గుట్టు తెలుసుకొని భద్రావతితో చేతులు కలపడం అన్నీ చెప్పేస్తారు. నర్మద అన్నింటికీ సాక్ష్యాలు కూడా చూపిస్తానని సిమ్ కార్డు ఫోన్ లో వేసి భద్రావతికి ఫోన్ చేసి నిజాలు తెలుసుకునేలా చేస్తుంది. నిజాలు తెలిసిన తర్వాత రామరాజు తల తిరిగి గుండె పట్టుకొని కూలబడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే




.webp)
.webp)
