Home

»

Tv News

వల్లీని ఇంటి నుంచి గెంటేసిన చందు.. ఇంటికొచ్చేసిన వేదవతి !

Oct 7, 2026 10:34AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -598 లో....వేదవతికి మెలకువ రావడంతో అందరు వెళ్లి చూస్తారు. డాక్టర్ వచ్చి ఏం కాదు ఇంటికి తీసుకెళ్లండి కానీ రెండు రోజులు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు. నేను చూసుకుంటానని వల్లీ అనడంతో వల్లీ కుట్రలు తెలిసిన చందు ఫైర్ అవుతాడు. మా అమ్మని నువ్వు చూసుకోవాల్సిన పని లేదు.. అసలు నువ్వు మా అమ్మని ముట్టుకోవద్దని అరుస్తాడు. ఇదంతా పాత కోపమా, కొత్తగా బావకి నూరిపోశారా అని వల్లీ అనుకుంటుంది. నా భార్యని ఎవరూ చూసుకోవాల్సిన పని లేదు.. నేనే చూసుకుంటానని రామరాజు అనడంతో అందరు వేదవతిని ఇంటికి తీసుకెళ్తారు.

ఇంట్లో వేదవతిని చూడటానికి విశ్వ, శాంతమ్మ వస్తారు. శాంతమ్మ ఏడవడం చూసి ఏం కాలేదు ఏడ్వకు అని వేదవతి చెప్తుంది. రామరాజు వచ్చి మందులు వేసి జాగ్రత్తగా చూసుకుంటుంటే నువ్వు ఇలా చూసుకోవడం వల్లే పుట్టింటి మీద బెంగ లేదని శాంతమ్మ అంటుంది. ధీరజ్ చాప, దిండు తీసుకొచ్చి నేను అమ్మ దగ్గరే పడుకుంటా అంటే, నా భార్యని నేను చూసుకుంటానని రామరాజు అంటాడు. ఇద్దరు సరదాగా పోట్లాడుకోవడంతో వేదవతి మురిసిపోతుంది. మరోవైపు నర్మద వేద ప్రమాదం గురించి బాధపడుతుంటే ప్రేమ ఓదారుస్తుంది. అమ్మ కంటే అత్తే నాకు ఎక్కువయ్యారంటూ నర్మద చిన్నపిల్లలా ఏడుస్తుంది. వల్లీ గురించి చెప్పేయాలి.. చందు వదలడని నర్మద, ప్రేమ అనుకుంటారు.

అదే టైమ్ లో సుకన్యకు చందుకి నిజం తెలిసిపోయిందని తెలుస్తుంది. వెంటనే పరుగు పరుగున వల్లీ దగ్గరకు వెళ్లి చందుకి విషయం తెలిసిపోయిందని చెప్తుంది. వల్లీ టెన్షన్ పడుతూ ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటే, భద్రావతితో మాట్లాడిన సిమ్ కార్డు పడేయమని సుకన్య చెప్తుంది. వల్లీ ఆ సిమ్ కార్డును నలిపి పడేసే టైమ్ కి చందు ఎంట్రీ ఇస్తాడు. ఏంటి అది అంటే దోమ అని వల్లీ కవర్ చేస్తుంది. ఆగు నేను దోమని కొడతానని చందు వల్లీని లాగిపెట్టి కొడతాడు. ఆ దెబ్బకి సుకన్య భయపడి పారిపోతుంది.

ఇక వల్లీని చందు నిలదీస్తాడు. భద్రావతితో చేతులు కలిపి ప్రేమ, ధీరజ్ లను విడదీస్తావా.. రైస్ మిల్లులో డబ్బు దొంగతనం చేసి ఆ నింద తిరుపతి మామయ్య మీద వేసి ఆయన్ని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేస్తావా.. నువ్వసలు మనిషివేనా అని అడుగుతాడు. దానికి వల్లీ.. ప్రేమా ధీరజ్ లు కలిసిపోయారు కదా.. తిరుపతి బాబాయ్ కూడా తిరిగి వచ్చారు కదా గొడవ చేయకని అంటుంది. కానీ చందు వినడు. నువ్వు అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకునే రకానివి, పాముకి పాలు పోసి పెంచితే కాటేయడం మానేస్తుందా.. నువ్వు ఎప్పటికీ మారవు.. మర్యాదగా బయటకు వెళ్లిపోమని వల్లీని గెంటేసి తలుపు వేసేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com