Home

»

Tv News

హాస్పిటల్ లో వేదవతి.. చందు నిజం చెప్పేసిన నర్మద! 

Oct 6, 2026 12:44PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -597 లో... ప్రేమ, నర్మద ఇద్దరు తన బండారం బయట పెట్టేస్తారని భయపడి వేదవతిని టార్గెట్ చేసింది వల్లి. వేద కింద పడి హాస్పిటల్ పాలయ్యేలా ప్లాన్ వేసింది. రామరాజు కాఫీ అడగడం విని కిచెన్ లోకి వెళ్లి కాఫీ పౌడర్ ను అటక మీద పెట్టింది. అక్కడ ఉన్న స్టూల్ కాలును కోసేసి అక్కడే పెట్టేసింది. దీంతో వేదవతి కాఫీ చేయడానికి వెళ్లి పౌడర్ కోసం వెతికి అటక మీద చూసింది. స్టూల్ ఎక్కగానే అది విరిగిపోయి కింద పడిపోయింది. కిచెన్ టాప్ కు తల తగలడంతో రక్తం వచ్చి కళ్లు తిరిగి పడిపోయింది. వేదవతి అరవడంతో అందరు పరుగున వచ్చారు.

వేదవతి పడిపోవడంతో రామరాజు, నర్మద, ప్రేమ, ధీరజ్ కలిసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో అందరూ బాధగా ఉండగా వల్లీ మాత్రం లోలోపల తన బండారం బయట పడలేదని హ్యాపీ అయింది. ధీరజ్ బాధపడుతుంటే ప్రేమ ఓదార్చడానికి వెళ్తే ధీరజ్ అరుస్తాడు. దానికి రామరాజు నీ భార్య మీద అరుస్తావేంట్రా అని అంటాడు. ఇంట్లో ముగ్గురు కోడళ్లు ఉండి కూడా 24 గంటలు కిచెన్ లోనే ఉంటారు.. స్టూల్ విరిగిపోయిందని ఎవరూ చూడలేదా అని ధీరజ్ ఫైర్ అవుతాడు. నేను చాలాసార్లు దాని మీదే కూర్చున్నా అది బాగానే ఉందని నర్మద అంటే బాగున్న స్టూల్ విరగడం ఏంటని ధీరజ్ ప్రశ్నిస్తాడు. తన గురించి తెలిసిపోతుందని వల్లీ దొంగ ఏడుపు మొదలు పెట్టి టాపిక్ ను డైవర్ట్ చేస్తుంది.

ఆ తర్వాత వల్లీని నర్మద బయటకు తీసుకెళ్లి చెంపపగలగొట్టి.. నువ్వే అత్తయ్యగారిని పడేశావ్ కదా.. నీ కుట్రలు బయట పెట్టేస్తానని నిలదీస్తుంది. దానికి వల్లీ దేవత లాంటి అత్తయ్యగారిని నేను ఇలా చేస్తానా నీకు అనుమానం ఉంటే మామయ్యగారికి చెప్పేయ్ అని డ్రామా చేస్తుంది. ప్రేమ కూడా రంగంలోకి దిగి నీ బండారం బయట పెట్టేస్తామని అంటే ఇప్పటికే అత్తయ్య బెడ్ మీద ఉంది.. మామయ్యను కూడా బెడ్ మీదకు పంపాలని చూస్తున్నావా అని వల్లీ పారిపోతుంది. ఇదంతా చాటుగా విన్న చందు నర్మద, ప్రేమల దగ్గరకు వచ్చి.. ఏమైందని అడగడంతో నర్మద మొత్తం చెప్పేస్తుంది. ప్రేమ, ధీరజ్ లను విడదీయడం.. 6 కోట్లు కొట్టేసి తిరుపతి మీద నింద వేయడం అన్నీ చెప్తుంది. దాన్ని వదలనని చందు ఆవేశంగా వెళ్తుంటే నర్మద ఆపి తనే మామయ్యకి మొత్తం చెప్తానని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com