స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -609 లో.... శ్రీవల్లి కేసు వాపసు తీసుకోవడంతో భాగ్యం షాక్ అవుతుంది. పోలీస్ స్టేషన్ లో మా అమ్మడిని యువరాణిలా అత్తారింటికి తీసుకుపోతే కేసు వాపసు తీసుకుంటామని భాగ్యం ఎస్ఐకి చెప్తుంది. కానీ వేదవతి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి పరువు తీశాక ఆలోచించేదే లేదని, కోర్టులోనే తేల్చుకుందామని సీరియస్ అవుతుంది. ధీరజ్, సాగర్ కూడా మీ మోసాల ఎవిడెన్స్ అన్నీ జడ్జి ముందు పెడతామని అంటారు.
అప్పుడే బయటి నుంచి శ్రీవల్లి వచ్చి అక్కర్లేదు.. కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ కేసే అక్కర్లేదని అంటుంది.. ఎస్ఐ గారు నేను ఈ కేసును వాపసు తీసుకుంటున్నానని చెప్పడంతో భాగ్యం, ఆనందరావు మైండ్ బ్లాక్ అవుతుంది. తప్పంతా నాదే, మా ఆయన బంగారం, మా అత్తామామ దేవుళ్లు, వాళ్లది ఏ తప్పూ లేదని వల్లి అంటుంది. నన్ను ఎవరూ బెదిరించలేదు, నాకు నేనుగానే నిర్ణయం తీసుకున్నానని చెప్తుంది. దెబ్బలు కొట్టారని, బంగారం గురించి టార్చర్ పెడుతున్నారని కేసు పెట్టి ఇప్పుడు దేవుళ్లు అంటున్నావని ఎస్ఐ గట్టిగా అడగ్గా అవన్నీ అబద్ధాలు, మా అమ్మానాన్న నాతో చెప్పించారని భాగ్యంను ఇరికిస్తుంది. దీంతో కోపంతో వల్లిని భాగ్యం చెంపలపై కొడుతుంది.
కేసు వాపస్ తీసుకున్నా రామరాజు, వేదవతి మాత్రం కనికరించరు. తిరిగి మన ఇంట్లోకి రావడానికే ఇదంతా చేశానని వాళ్ల కాళ్లపై పడినా పట్టించుకోకుండా వెళ్లిపోతారు. చందును కూడా రిక్వెస్ట్ చేసినా వదిలించుకొని వెళ్లిపోతాడు. ఇంటికి వచ్చాక రామరాజు తన పెద్ద కోడలిని ఎంతో నమ్మాను.. ఇంత మోసం చేసిందని బాధపడతాడు. ఇక వల్లికి విడాకులు ఇచ్చేస్తానని చందు అంటాడు. మళ్లీ దాన్ని తెచ్చి నెత్తిమీద పెడతానంటే ఒప్పుకోనని గట్టిగా చెప్తాడు. చివర్లో ఏడుస్తూ కూర్చున్న వల్లిని భాగ్యం ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటూ గెంటేస్తుంది. నా కాపురం నాశనం అవడానికి కారణం నువ్వేనని వల్లి తల్లిపై కుండబద్దలు కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Illu Illalu Pillalu Today Episode October 19th, Illu Illalu Pillalu Serial, Srivalli Case Withdraw Shock, Bhagyam Slaps Vallli, Chandu Divorce Warning]




