Home

»

Tv News

Illu Illalu Pillalu: భాగ్యం డిమాండ్ అదే.. వల్లికి మాస్ వార్నింగ్ ఇచ్చిన నర్మద!

Oct 18, 2026 10:04AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -608 లో....వల్లీ వాళ్లని విశ్వ ఆపి.. కేసు వెనక్కి తీసుకోమని అంటాడు. వల్లీ వాళ్లు మాట వినకపోవడంతో బెదిరిస్తాడు. దాంతో వల్లీ మీ అత్తే మాకు ఈ ప్లాన్ ఇచ్చింది.. ఇప్పుడు నువ్వు అడ్డుకుంటున్నావా అని తిరిగి విశ్వని బెదిరిస్తుంది. దీంతో వల్లీతో.. నా అక్కవి అనుకొని చెప్తున్నా, నేను తప్పులు చేశాను కాబట్టే తెలుసుకొని సరి చేసుకుంటున్నా, నువ్వు తప్పుల మీద తప్పులు చేసి బోర్డర్ క్రాస్ చేస్తున్నావ్ .. అది నీ జీవితానికే మంచిది కాదని విశ్వ వార్నింగ్ ఇస్తాడు. అయినా వల్లీ వాళ్లు వినకుండా వెళ్లిపోతారు.

మరోవైపు పోలీస్ స్టేషన్ లో వేదవతి భోజనం చేయకపోవడం వల్ల కళ్లుతిరిగి పడిపోతుంది. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. ఇంతలో నర్మద వాళ్లు వచ్చి అన్నం తినమని బతిమాలుతారు. వేదవతి తినను అంటుంది. ఇది మీ ఇల్లు కాదని ఎస్ఐ అనగా మీరు చేసింది కరెక్ట్ కాదని నర్మద అంటుంది. ఇది గృహ హింస కేసు, సాక్ష్యాలు వాళ్ల వైపే ఉన్నాయని ఎస్ఐ అంటుంది. తన ఒంటి మీద ఉన్న దెబ్బలు సాక్ష్యాలు అంటున్నారు కదా.. మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని నర్మద అంటే, మీరు వాళ్ల మీద కేసు పెట్టి కోర్టులో తేల్చుకోండి అని ఎస్ఐ అంటుంది. 

చివర్లో వల్లీని పక్కకి తీసుకెళ్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది నర్మద. నీ కాపురం నువ్వే కూల్చేసుకుని నీ గొయ్యి నువ్వే తీసుకున్నదానివి అవుతావని.. డిసైడ్ అవ్వు నీ కాపురం కూల్చుకుంటావా లేదంటే కేసు వెనక్కి తీసుకుంటావా అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. దీంతో వల్లి ఆలోచనలో పడుతుంది. భాగ్యం ఎంట్రీ ఇచ్చి మా అమ్మడిని యువరాణిలా అత్తారింటికి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తుంది. వీళ్ల మోసాలు కోర్టులోనే తేల్చుకుందామని సాగర్, ధీరజ్ అనడంతో అక్కర్లేదని వల్లి ఎంట్రీ ఇచ్చి కేసు వాపస్ తీసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Illu Illalu Pillalu Today Episode October 17th, Illu Illalu Pillalu Serial Star Maa, Valli Case Withdraw, Narmada Strong Warning]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com