
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 607 లో... వల్లీ వాళ్లకి కేసు వాపస్ తీసుకోమని అంటే మా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి నా కూతుర్ని కాపురానికి తీసుకెళ్తే కేసు వెనక్కి తీసుకుంటామని భాగ్యం కండిషన్ పెడుతుంది. దాంతో ధీరజ్ కోపం ఆపుకోలేక ఆనందరావుని లాగిపెట్టి కొడతాడు. భాగ్యం వాళ్లు రెచ్చగొట్టి వీడియో తీయమని అనడంతో నర్మద ధీరజ్, ప్రేమని ఆపి ఇంటికి తీసుకెళ్తుంది. నర్మద, ధీరజ్, ప్రేమలు పోలీస్ స్టేషన్ కి బయల్దేరడంతో భద్రావతి వెటకారం చేసి ఎదురు వస్తుంది.
మరోవైపు తిరుపతి, సుకన్య పోలీస్ స్టేషన్ కి క్యారేజ్ తీసుకెళ్తారు. రామరాజు, చందు, వేదవతిని తినమని తిరుపతి బతిమాలితే భోజనం వద్దు ఏం వద్దురా.. తినకపోతే ఏం అవుతుంది చచ్చిపోతా అంతే కదా.. ఈ అవమానం భరించే కంటే చనిపోవడమే బెటర్ అని వేదవతి అంటుంది. నర్మద, ధీరజ్, ప్రేమలు వల్లీ వాళ్ల ఇంటికి వెళ్లారు. కేసు వెనక్కి తీసుకునేలా చేస్తారని తిరుపతి చెప్తాడు. సుకన్య మాట్లాడటంతో వేదవతి ఇది కూడా వాళ్ల పార్టీనేరా.. పెద్దోడికి తెచ్చిన పరిస్థితే నీకు తెస్తుందిరా అని అంటే తనతో మాట్లాడటం లేదు అక్క.. చిన్న అనుమానం వచ్చినా తన్ని తరిమేస్తామని తిరుపతి అంటాడు. రామరాజు అయితే నేను నమ్మిన వాళ్లే నాకు దెబ్బకొట్టారురా ఆ బాధతో కడుపు నిండిపోయిందని బాధపడతాడు.
ఇక విశ్వ దగ్గర అమూల్య ఏడ్చేస్తుంది. విశ్వ ఓదారుస్తాడు. భద్రావతికి ధీరజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఎక్కువ మాట్లాడితే మా అత్త, అమ్మమ్మకి చెప్పి నిన్ను బయటకు గెంటిస్తానని అంటాడు. వల్లికి కూడా నర్మద స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అసలు కేసు వెనక్కి తీసుకోవాలంటే వల్లీ పెట్టిన కండిషన్ కి నర్మద, ప్రేమ ఒప్పుకుంటారా.. రామరాజు కుటుంబం జైలు నుంచి బయటకు వస్తుందా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
