.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -605 లో.....ఎస్ఐ ఝాన్సీ రామరాజు ఇంటికి వచ్చి రామరాజు, వేదవతి, చందులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి షాక్ ఇచ్చింది. మీ పెద్ద కోడలు శ్రీవల్లి గృహహింస కేసు పెట్టిందని, అత్తమామలు, భర్త కొట్టి హింసిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిందని ఎస్ఐ చెప్తుంది. కుటుంబం మొత్తం బతిమాలినా వినకుండా ముగ్గురినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లింది. ఆ వగలాడి మాపై కేసు పెట్టిందా అంటూ వేదవతి ఫైర్ అవుతుంది. నర్మద, ధీరజ్ మాట్లాడేందుకు ప్రయత్నించినా స్టేషన్ కి వచ్చి మాట్లాడుకోమని ఎస్ఐ సీరియస్ అయింది. స్టేషన్ బెయిల్ కూడా రాదని.. 3 నెలల వరకు నో బెయిల్ అని చెప్పడంతో కుటుంబం కంగుతింది.
రామరాజు ఫ్యామిలీని పోలీసులు తీసుకెళ్తుంటే బయటే ఉండి భద్రావతి, సేనాపతి రాక్షసానందం పొందుతారు. ఏంట్రా సేనా ఆ కూలోడు రామరాజును పోలీసులు తీసుకెళ్తున్నట్టు ఉన్నారని భద్రావతి అవమానించేలా మాట్లాడుతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లడం అంటే పరువు తక్కువ, ఎవరైనా చస్తారు, వీడేంటి సినిమాకి వెళ్తున్నట్టు వెళ్తున్నాడని వెటకారం చేస్తుంది. వాడికి సిగ్గు శరం ఉంటే కదా ఫీలవడానికి అని సేనాపతి అనడంతో ధీరజ్ పట్టరాని కోపంతో సేనాపతి కాలర్ పట్టుకుంటాడు. రేయ్ పిల్లబచ్చా, ముందు మీ అమ్మానాన్నలను, అన్నయ్యను బయటకు తీసుకొచ్చి అప్పుడు మాట్లాడమని భద్రావతి ధీరజ్ కి సవాల్ విసురుతుంది. ఇదంతా చూసి రామరాజు కుమిలి కుమిలి ఏడుస్తాడు. తన జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదని బాధపడతాడు.
పోలీసులు తీసుకెళ్లాక నర్మదను భద్రావతి పిలిచి ఏంటి నర్మదా మేడం, నీ పెళ్లి రోజు గిఫ్ట్ బాగుందా అని వెటకారంగా అంటుంది. నీ పెళ్లి రోజే మీ అత్తమామలు జైలుకు వెళ్తున్నారు.. ఎలా ఉంది గిఫ్ట్ అంటూ పొగరుగా మాట్లాడుతుంది. దీని వెనక ఎవరున్నారో తర్వాత తేలుస్తానని నర్మద వార్నింగ్ ఇస్తుంది. ఇక స్టేషన్ లో వల్లీ గాయాలు చూపిస్తూ డ్రామా ఆడుతుంది. భర్త తన ముందే చంపేస్తానన్నాడని.. ఇంట్లో ఎంత టార్చర్ పెట్టి ఉంటాడో చూడండని భాగ్యం కూడా డ్రామా మొదలుపెడుతుంది. ఇవన్నీ అబద్ధాలు, ఆ దెబ్బలు కూడా తనే కొట్టుకుందని ప్రేమ వాదిస్తుంది. నర్మద, ధీరజ్, ప్రేమ, సాగర్ లాయర్ ని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

