.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -537 లో..... ప్రేమ బాధపడుతుంటే భద్రవతి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అసలు వాడికి ప్రేమ అంటే ఇష్టం లేదు.. వెళ్తుంటే కూడా ఆపలేదని భద్రవతి అంటుంది. ప్రేమ తొందరపడ్డావేమోనని అనిపిస్తుందని విశ్వ అనగానే నువ్వు ఏంట్రా ఇలా మారిపోయావు.. మీ చెల్లికి ఉన్న పౌరుషం కూడా నీకు లేదని భద్రవతి అంటుంటే ఎంతసేపు పౌరుషం, పగ అంటారు కానీ దాని కాపురం గురించి అసలు ఎవరైనా ఆలోచించారా అని రేవతి అంటుంది.
మనమేనా ఆలోచించేది.. వాళ్ళు ఆలోచించారా.. మేనత్త అంటుంది కానీ తనైనా వచ్చిందా అని భద్రవతి అంటుంది. దాంతో ప్రేమ బాల్కనీ నుంచి ఎవరైనా వస్తారేమోనని చూస్తుంది. నిజమే నా గురించి ఎవరు రావడం లేదని ప్రేమ బాధపడుతుంది. మరొకవైపు ధీరజ్ బాధపడుతుంటే వేదవతి వచ్చి ఇదంతా నా వాళ్లనే జరిగింది.. నన్ను క్షమించురా అని అనగానే నువ్వు మంచి గురించి అలోచించి అలా చేసావ్ అమ్మ అని ధీరజ్ అంటాడు. మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు.. వెళ్లి తీసుకొని రారా అని వేదవతి అంటుంది. మరొకవైపు వల్లి అనుకుంది చేసిందని తనని పూలు చల్లుతూ భాగ్యం వాళ్ళు స్వాగతం చెప్తారు. అనుకున్నది అయిందని అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ, ధీరజ్ ల ఫోటో తీసుకొని హీరో, హీరోయిన్ కాపురం కూలిపోయిందని వాళ్ళ ఫోటోని మంటలో వేస్తుంది వల్లి. ఆ తర్వాత నర్మద, సాగర్ ల ఫోటో తీసుకొని నెక్స్ట్ వీళ్ళే అని వాళ్ళ ఫోటో మంటలో వేస్తుంది వల్లి.
మరొకవైపు ప్రేమకి నర్మద ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ వస్తుంది. ఈ ప్రేమ ఎందుకు ఇలా చేస్తుందని నర్మద అంటుంటే సాగర్ వస్తాడు. మరి నువ్వు చేసిందేంటి.. నా దగ్గర నిజం దాచి తప్పు చేసావని నర్మదతో సాగర్ గొడవ పడుతాడు. ఎవడి గోల వాడిదే అన్నట్లు మా ఆయన బాధ అయనదే అని నర్మద అనుకుంటుంది. మరొకవైపు తిరుపతి, రామారాజు ఒక దగ్గర డ్రింక్ చేస్తారు. నన్ను వాళ్ళు పనోడు అంటు ఎన్ని మాటలు అన్నా కూడా.. నా బుజ్జమ్మ ఉందనుకున్నా కానీ ఇంత మోసం చేసిందని రామరాజు బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

