
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 588 లో....నర్మద, వేదవతి, వల్లీ ప్రేమ కోసం పెళ్లి చీర, తాంబూలం, శుభలేఖ తీసుకొని భద్రావతి ఇంటికి వస్తారు. బయట ఉన్న రౌడీలను చూసి నర్మద వల్లీని మాట్లాడి లోపలికి పంపించమంటే.. వల్లీ ఏకంగా వాళ్లను తోసేసి అత్త, తోటికోడళ్లను లోపలికి తీసుకెళ్తుంది. దీంతో వేదవతి.. దీనికంటే ఇంత బలం ఉందా, మనం కొడితే ఎందుకు సైలెంట్ గా ఉంది, జాగ్రత్తగా ఉండాలని నర్మదతో అంటుంది. లోపలికి వెళ్లి ప్రేమను పిలిచి మీ మామయ్య పెళ్లికి చీర కొన్నారని చెప్తుంది. చీర మామయ్య కొన్నా సెలెక్ట్ చేసింది నీ భర్తేనని నర్మద అంటుంది. ఈ పెళ్లి జరగదు, మామయ్యకి చెప్పండి అత్త అని ప్రేమ అంటుంది. అది విన్న భద్రావతి వచ్చి తాంబూలం పళ్లెం తోసేస్తుంది.
దీంతో పెద్ద గొడవ మొదలవుతుంది. మంగళకరమైన సారెను నేలపాలు చేస్తావా అని వేదవతి అడిగితే నా మేనకోడలు వద్దంటోంది.. నేను ప్రేమను కన్నదానికంటే ఎక్కువగా పెంచాను.. నా బిడ్డకు ఏం కావాలో నాకు తెలుసంటూ వారి మెడ పట్టి గెంటేస్తానని బెదిరిస్తుంది భద్రావతి. సరిగ్గా అప్పుడే ధీరజ్ ఎంట్రీ ఇస్తాడు. కింద పడిన తాంబూలం, శుభలేఖ తీసి తల్లికి ఇచ్చి..ఇది నా పెళ్లాం ఇల్లు అంటే నా అత్తారిల్లు..ఇక్కడికి నేను ఎప్పుడైనా రావచ్చు. ఇది నీ పుట్టిల్లే తప్ప సొంత ఇల్లు కాదు.. ఎక్కువ మాట్లాడితే నిన్నే బయటకు గెంటిస్తానని భద్రావతికి ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ప్రేమతో ఎమోషనల్ గా మాట్లాడుతూ.. శుభలేఖ అంటే పెళ్లికి పిలవడం కోసం కాదు.. మన భార్యాభర్తల బంధం నూరేళ్ల ప్రయాణానికి మొదటి అడుగు. మనది అనుకోకుండా ముడిపడిన బంధం కాదు.. దేవుడు ముడివేసిన బంధం అంటూ ఈరోజు పదిన్నరకు పెళ్లి. నీ కోసం ఎదురుచూస్తానని శుభలేఖ చేతిలో పెట్టి వెళ్తాడు.
ఇటు రామరాజు అందరికి శుభలేఖలు పంచుతూ రాత్రి 10:30కి తన చిన్న కొడుకు పెళ్లి అని పిలుస్తాడు. సేనాపతి దగ్గరకు వెళ్లి కూడా శుభలేఖ ఇవ్వగా ఈ పెళ్లి జరగనివ్వనని సేనాపతి అంటాడు. దానికి రామరాజు. మీ తాత ముత్తాతలు దిగి వచ్చినా ఈ పెళ్లి ఆగదని గట్టిగా చెప్తాడు. ఇంట్లో హల్దీ వేడుక మొదలవుతుంది. చందు, సాగర్ ధీరజ్ ని ఎత్తుకుని డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తారు. ఇదంతా చూసిన వల్లీ నర్మదతో.. మీరు ఇంత హడావుడి చేస్తున్నారు కానీ పెళ్లి జరుగుతుందా అని వెటకారంగా అంటుంది. నువ్వు ఎంత ఎగిరినా ధీరజ్, ప్రేమల పెళ్లి అయి ఇంటికి వచ్చిన మరుక్షణమే నువ్వు పుట్టింటికి పరుగెత్తడం ఖాయమంటూ నర్మద కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Illu Illalu Pillalu, Illu Illalu Pillalu Episode 588, Star Maa Serial, Dheeraj, Prema, Bhadravathi, Narmada, Vedavathi, Valli, Senapathi]





.webp)
