
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 571 లో.....రైస్ మిల్లులో పోయిన ఆరు లక్షల వెనుక సూత్రధారి వల్లీ అని కనిపెట్టేసిన నర్మద బెత్తంతో ఆ దండుపాళ్యం బ్యాచ్ కి చుక్కలు చూపించింది. చెప్పు సుకన్య కథలో బల్లి ఎవరో చెప్పుకొని చూద్దామంటూ వల్లీని నిలదీసి.. బావిలోకి దూకి అందరి మనసులు గెలుచుకుని.. ధీరజ్ ప్రేమలను విడగొట్టి, డబ్బులు కొట్టేసి, తిరుపతి బాబాయ్ ను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసి నింద భద్రవతి మీద పడేలా చేశావని నర్మద బయటపెట్టింది. దీంతో వల్లి మొదట దండం పెడతానంటూ డ్రామా చేసి వెంటనే మాట మార్చి నిజం నిరూపణ కావాలంటే సాక్ష్యాలు కావాలి.. కథలు కాదంటూ ఆస్కార్ రేంజ్ నటనతో ఎదురు తిరిగింది.
నువ్వు చేసింది నిరూపిస్తే ఇంటి నుంచి వెళ్లిపోతావా అని నర్మద ఛాలెంజ్ చేయగానే నిరూపిస్తే వెళ్లిపోతా లేకపోతే నువ్వేం చేస్తావో తర్వాత చెప్తానంటూ వల్లీ పొగరుగా బదులిచ్చింది. నీ నిజస్వరూపం బయటపడే రోజు దగ్గర్లోనే ఉందని నర్మద హెచ్చరించి వెళ్లిపోయాక ఈ నర్మద మామూలుది కాదు పట్టపగలే చుక్కలు చూపించిందని భాగ్యం, సుకన్య భయపడతారు. ఆ భయంతోనే మనం నోరు జారతామని తన ప్లాన్.. ఎవరూ నోరు జారొద్దని వల్లీ వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు గదిలో వేదవతి వల్లీకి అంత సీన్ లేదని అన్నా.. ఆ వల్లీ అమాయకంగా కనిపించే అనకొండ..దాన్ని తక్కువ అంచనా వేస్తే మన మెడకే చుట్టుకుంటుందని నర్మద అంటుంది.
మరోవైపు పెళ్లి వాళ్ల ఇంటికి వెళ్లి సంబంధం చెడగొట్టారని భద్రవతి రగిలిపోతుంటుంది. ఇది ధీరజ్ గాడి పనే అని సేనాపతి అనడంతో వాడితో వెళ్లిన అమ్మాయి ఎవరో ప్రేమకే తెలుసని ప్రేమను పిలుస్తుంది. విశ్వ ఫ్లోలో పెద్దక్క, నర్మద అక్క అనడంతో భద్రవతి చెంపపగులగొట్టి.. ఆ కూలోడి ఫ్యామిలీని వరుసలతో పిలవద్దని వార్నింగ్ ఇచ్చి.. వాళ్లు చెడగొట్టినంత మాత్రాన పెళ్లి ఆగదని సవాల్ చేస్తుంది. చివర్లో తిరుపతిని ధీరజ్ ఎత్తుకుని తిప్పడంతో నడుం నొప్పి అంటూ కామెడీ చేసి.. మీరిద్దరు కలిస్తే ఏదైనా సాధిస్తారని చెప్పగా..వేదవతి డబ్బులు తీశావా అని అడిగినందుకే తిరుపతి అలిగి వెళ్లిపోయాడని బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






