Home

»

Tv News

ప్రేమ కోసం ధీరజ్ అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్!

May 16, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -473 లో..... ధీరజ్ కార్ కొని మొదటగా తనని ఎక్కించుకొని వెళ్ళలేదని ప్రేమ ఫీల్ అవుతూ ఎమోషనల్ సాంగ్స్ వింటుంది. అప్పుడే నర్మద వస్తుంది. ఏమైందని అడుగుతుంది. ధీరజ్ అంటే నాకు ఎంత ఇష్టం.. వాడికి అసలు నేనంటే ఇష్టం లేదు.. నన్ను కార్ లో ఎక్కంచుకోలేదని ప్రేమ అంటుంది. ఫీల్ కాకు ప్రేమ వాళ్ళ అమ్మనాన్న అంటే తనకి ఇష్టం కదా అని నర్మద చెప్తుంది. అప్పుడే ధీరజ్ వచ్చి.. ప్రేమ కాఫీ తీసుకొని రా అంటాడు.

నేను ఎందుకు ఇస్తాను కాఫీ.. కార్ లో మీ అమ్మని ఎక్కించుకొని వెళ్లి కాఫీ తాగమని ప్రేమ కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం అన్నానని ధీరజ్ అంటాడు. ప్రేమ మళ్ళీ వచ్చి కార్ లో ఎక్కించుకొని వెళ్ళడానికి నేను అవసరం లేదు కానీ పనులు చెయ్యడానికి కావాలని ప్రేమ అంటుంది. అసలు ఏమైంది వదిన అని నర్మదని ధీరజ్ అడుగుతాడు. కార్ లో మొదటగా మీ అమ్మనాన్నని ఎక్కించుకున్నావ్ కదా తనని ఎక్కించుకోలేదని ఫీల్ అవుతుందని నర్మద చెప్తుంది. దాంతో ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. ప్రేమ కోపంగా డోర్ పెడుతుంది డోర్ తియ్యవే నిన్ను బయటకు తీసుకొని వెళదామని వచ్చాను అని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత కాసేపటికి ప్రేమ చీర కట్టుకొని బయటకు వస్తుంది. నేను నీతో ఏం బయటకు రావడానికి రెడీ అవ్వలేదు.. నా ఫ్రెండ్ బర్త్ డే ఉందని ప్రేమ అంటుంది.

ఆ తర్వాత ప్రేమని ఎత్తుకొని వెళ్లి ధీరజ్ కార్ లో కూర్చొపెడుతాడు. ఎవరు లేని ఏకాంతమైన చోటుకి ప్రేమను తీసుకొని వెళ్తాడు ధీరజ్. అక్కడ తనకి సర్ ప్రైజ్ గా లైట్స్ తో డెకరేషన్ చేస్తాడు. ముందు కేక్ ఉంటుంది. ప్రేమ చాల హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రోజు ఎవరి బర్త్  డే లేదు కదా అని ప్రేమ అంటుంది. ఈ రోజు మన కొత్త ప్రయాణం మొదలవుతుంది అందుకే అని ధీరజ్ చెప్తాడు. ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు. ప్రేమకి బొకే ఇచ్చి ధీరజ్ ఐ లవ్ యు అని చెప్తాడు. లవ్ యూ టూ రా అని ప్రేమ చెప్తుంది. ఆ తర్వాత ప్రేమని ధీరజ్ రొమాంటిక్ గా దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com