స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -422 లో..... భాగ్యం వాళ్లకి శ్రీవల్లి వీడియో కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఆ ధీరజ్ గాడు ప్రేమని దూరం పెట్టాడని చెప్తుంది. మన గురించి రాకుండా నేను వాళ్ళ సైడ్ మాట్లాడానని శ్రీవల్లి అనగానే నువ్వు ఆ ఇంట్లో ఎలా నెగ్గుకాస్తావో అనుకున్న కానీ తెలివిగా చేస్తున్నావని భాగ్యం మెచ్చుకుంటుంది. అవన్నీ నా పోలికలు అని ఆనందరావు అంటాడు. ఆ తర్వాత విశ్వ తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాడు. ఆ అమూల్య పీడ విరగడ అయింది. ఇక నా కూతురు పరువు పోయింది.. అందరు నువ్వే తన భర్త అనుకుంటున్నారని రేపు నా కాళ్ళ దగ్గరికి వస్తారని విశ్వ గర్వంగా చెప్తాడు.
మరొకవైపు రామరాజు, తిరుపతి డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. వాడికి ఎంత ధైర్యం బావ మన ఇంటి ఆడపిల్లని కిడ్నాప్ చేస్తాడా వాడి కాళ్ళు విరగ్గొడుతానని తిరుపతి అంటాడు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వాడి కాళ్ళు ఇప్పుడే విరగ్గొడుతానని రామరాజు వెళ్తాడు. మరొకవైపు సాగర్, ధీరజ్ తో చందు మాట్లాడుతాడు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మీ భార్య లు అంత పెద్ద విషయం ఎందుకు దాచారని చందు అంటాడు. నాన్నే కరెక్ట్.. నాకు పెళ్లి చేసి మంచి అమ్మాయిని తీసుకొని వచ్చాడు. తనకి ఎప్పుడు మావయ్య పరువు కుటుంబం అనే ఆలోచిస్తుందని చందు అంటాడు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది వదిలేయ్ బావ వాళ్ళు చిన్న పిల్లలు అని శ్రీవల్లి అంటుంది. అప్పుడే తిరుపతి వచ్చి మీ నాన్న ఆ విశ్వ పైకి గొడవ కీ వెళ్ళాడని చెప్పగానే ముగ్గురు కొడుకులు వెళ్తారు.
రామరాజు వెళ్లి ఆ విశ్వని కొడుతుంటే ముగ్గురు కొడుకులు వెళ్లి ఆపుతారు. ఆ తర్వాత నర్మదతో సాగర్ మాట్లాడకుండా కింద చాపపై పడుకుంటాడు. అలాగే ధీరజ్ కూడా ప్రేమతో మాట్లాడకుండా నేలపై పడుకుంటాడు.ఆ తర్వాత అమూల్యని ధీరజ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తాడు. విశ్వపై కిడ్నాప్ కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసి ఉగాది పచ్చడి వేదవతి అందరికి పెడుతుంది. ప్రేమ, నర్మద చెయ్ పట్టేసరికి శ్రీవల్లికి పెట్టమని ఇస్తుంది. ప్రేమ, నర్మద బాధపడేలా శ్రీవల్లి మాట్లాడుతుంది. తరువాయి భాగంలో విశ్వని కొట్టారని సేనాపతి గొడవకి వస్తాడు. అప్పుడే పోలీసులు వచ్చి విశ్వని అరెస్ట్ చేస్తారు. వేదవతి, భద్రవతికి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




