Illu Illalu Pillalu: మందు అనుకొని కూల్ డ్రింక్ తాగిన శ్రీవల్లి.. ఇచ్చిపడేసిన ప్రేమ!
on Dec 16, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-342 లో... అమూల్య, విశ్వ గురించి చందు చెప్పకుండా శ్రీవల్లి ఆపిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను డ్యాన్స్ చేస్తుంటే వెనకాల నుండి ప్రేమ వచ్చి.. ఏంటి ఈ రోజు తేడాగా బిహేవ్ చేస్తున్నావ్.. చందు బావ ఏదో చెప్తానంటే వద్దని దెబ్బ తాకినట్లు యాక్టింగ్ చేసావ్ ఎందుకని ప్రేమ అడుగుతుంది. అదేం లేదని శ్రీవల్లి అనగానే నీకు ఈ రోజు ఉందని ప్రేమ కోపంగా అంటుంది. అమ్మో మళ్ళీ తాగేసి వచ్చి కొడుతుందా ఏంటని శ్రీవల్లి భయపడుతుంది.
మరొకవైపు ఇంట్లో రామరాజు లేడని తిరుపతి సిట్టింగ్ ఎరేంజ్ చేస్తాడు. ధీరజ్, సాగర్, చందు ముగ్గురు లుంగీ కట్టుకొని వస్తారు. మందుకి లుంగీకి మంచిగా సెట్ అయిందని తిరుపతి అంటాడు. చందు డల్ గా ఉంటాడు. ఏమైందని వాళ్ళు అడుగగా అమూల్య విషయం చెప్పలేక.. నాన్న తాగితే ఏమైనా అంటాడేమోనని కవర్ చేస్తాడు.

ఆ తర్వాత శ్రీవల్లి భయపడుతూ.. ప్రేమ ఎక్కడ తాగేసి వచ్చి కొడుతుందోనని తిరుపతి దగ్గర ఉన్న కూల్ డ్రింక్ తీసుకుంటుంది. అందులో మందు కలిపి ఉంటాడని అనుకొని ప్రేమ కంటే ముందే తాగాలని శ్రీవల్లి తాగి ప్రేమ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత శ్రీవల్లి దగ్గరికి తిరుపతి వచ్చి నా కూల్ డ్రింక్ తెచ్చుకొని నువ్వు తాగావని అడుగుతాడు. అది మందు కాదా అని శ్రీవల్లి అనగానే లేదని తిరుపతి అంటాడు. దాంతో మళ్ళీ శ్రీవల్లిలో భయం మొదలవుతుంది. అప్పుడు ప్రేమ తనకి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.
ఆ తర్వాత సాగర్ డ్రింక్ చేసి నర్మద దగ్గరికి వస్తాడు. తనని అందంగా ఉన్నావని పొగుడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



