Home

»

Tv News

Illu Illalu Pillalu: చందు మాజీ లవర్ అంజలి ఎంట్రీ.. భాగ్యాన్ని ఉసిగొల్పిన భద్రావతి!

Oct 31, 2026 9:20AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -619 లో....చందు మాజీ లవర్ అంజలి వస్తుంది. ఆమెను ధీరజ్ చూస్తాడు. మరోవైపు రామరాజును ఊరందరి ముందు అవమానించేందుకు భాగ్యాన్ని భద్రావతి ఉసిగొల్పుతుంది.

బతుకమ్మను ఎత్తుకొని అంత దూరం నడవలేవ్ కానీ కార్లో తీసుకెళ్తానని ప్రేమతో ధీరజ్ చెప్తాడు. నాయనా ధీరజ్.. భార్య మీద ప్రేమ ఉండొచ్చు కానీ నడిస్తే కందిపోతుందేమో అన్నంత మాత్రం ఉండకూడదని నర్మద సెటైర్ వేస్తుంది. అసలే ఆమె శత్రుదేశపు యువరాణి కదా వదిన అని ప్రేమను ధీరజ్ ఎగతాళి చేస్తాడు. అమ్మను కార్లో తీసుకెళ్తానని అనకుండా భార్యను తీసుకెళ్తానని అంటే మీరు ఫీల్ అవుతారు కదా అని ప్రేమ ధీరజ్‌ను ఇరికిస్తుంది. దీంతో వేదవతి ఏడుస్తుంది‌. నువ్వు మారిపోయావ్ ధీరజ్ అని ఫీల్ అవుతుంది.

బతుకమ్మ పండగను ధూమ్ ధామ్‌గా చేసుకోవాలని చందు అంటాడు. ఇదంతా దూరం నుంచి భద్రావతి, సేనాపతి చూస్తారు. ఊరందరి ముందు పరువు పోగొట్టుకోవడానికి సంబరంగా వెళ్తున్నారక్కా అని సేనాపతి అంటాడు. ఇకపై ఎవరైనా శత్రువుపై పగ తీర్చుకోవాలనుకుంటే నేను తీర్చుకున్నట్లే తీర్చుకోవాలని భద్రావతి గర్వంగా చెప్పుకుంటుంది. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు కానీ ఆ రామరాజు ఇంట్లోని ఉండి కుమిలిపోవాలి అక్క అని సేనాపతి చెప్తాడు. భాగ్యాన్ని ఆ రామరాజు మీదకు ఉసిగొల్పా, విడాకుల విషయం మాత్రమే చెప్తే పరువు తీయదు, ఇంకేదో ఎగేసి చెప్పాలని భద్రావతి సైకోలా ఆలోచిస్తుంది. మరోవైపు బతుకమ్మ తీసుకొని వచ్చిన వల్లి తన అత్తారింటి వాళ్ల కోసం ఎదురు చూస్తుంది. పండగ అంటే రామరాజు కుటుంబంలా చేసుకోవాలని ఊరంతా అనుకునేవాళ్లు, ఇదంతా నా కర్మే అని వల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే అంజలి ఎంట్రీ ఇస్తుంది. ఆమె వీరమాచినేని దశరథ రామయ్య కూతురు. అంజలి పెళ్లి ఘనంగా చేశారు కానీ అత్తారింటి నుంచి వచ్చేసి ఇంట్లో ఉంటుంది. నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.. నా పాత ప్రేమను గుర్తు చేయకు.. చందును కానీ ఆ కుటుంబాన్ని కానీ నా కంట పడకుండా చూడు తల్లి అని బతుకమ్మను అంజలి వేడుకుంటుంది. అంటే చందు మాజీ ప్రేయసి అంజలి అని తెలుస్తోంది. బతుకమ్మను ఎత్తుకొని నడుస్తున్న ప్రేమను చూసి ధీరజ్ పాటలు పాడుతాడు. తన అత్తారింటి వాళ్లను చూసి వల్లి సంతోషంగా ఫీల్ అవుతుంది. శుభమా అని బతుకమ్మను ఎత్తుకొస్తుంటే దిష్టిబొమ్మలా ఇక్కడకు కూడా వచ్చావేంటని చందు ఫైర్ అవుతాడు. మా వెంట రాకు, కళ్ల ముందు కనిపించకని వల్లిపై వేదవతి సీరియస్ అవుతుంది. మీరు ఎన్ని మాటలు అన్నా పడతా, నా తప్పులు ఉన్నాయి, అందరూ చూస్తున్నారు కదా బతుకమ్మ పెట్టనివ్వండని వల్లి వేడుకుంటుంది. గుడిలో ధీరజ్, తిరుపతి పులిహోర ప్రసాదం తింటూ ఉండగా అంజలిని ధీరజ్ చూస్తాడు. అంజలి కూడా ధీరజ్‌ను చూసి దూరంగా వెళ్తుంది కానీ ధీరజ్ పరుగెత్తుకుంటూ వెళ్లి మాట్లాడతాడు. మీరు అంజలినే కదా అని అడిగితే ఆమె సైలెంట్‌గా ఉండిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com