Home

»

Tv News

Illu Illalu Pillalu: స్థలం అమ్మేందుకు రెడీ అయిన రామరాజు.. సేటుతో సాగర్ ఛాలెంజ్.!

Oct 25, 2026 10:09AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-614 లో.. ధీరజ్ వేలంపాటలో 12 లక్షల ట్రావెల్ ఏజెన్సీని 30 లక్షలకు పాడినందుకు ప్రేమ తిడుతుంది. తన నగలు అమ్మి కడతానంటే అవి నగలు కాదు నాగుపాములు, మీ అత్త పెళ్లాం నగలు అమ్ముకున్నాడని ఫ్లెక్సీలు వేయిస్తుందని ధీరజ్ అంటాడు. రామరాజు, చందు వచ్చి విషయం తెలుసుకుంటారు. నేను లేనా, సర్దుబాటు చేస్తానని రామరాజు అంటే ధీరజ్ వద్దంటాడు.

అదే టైంలో సాగర్ కి అప్పు ఇచ్చిన సేటు ఇంటికి వస్తాడు. నెల నెల వడ్డీనే కడుతున్నావ్, అసలు కట్టట్లేదు, నీ దగ్గర 10 లక్షల బంగారం షాపులో ఉంటే రైడ్ వస్తే ఇబ్బందని రామరాజుతో తేల్చుకోవడానికి వచ్చానని అంటాడు. సాగర్ రెచ్చిపోయి.. డబ్బు తీసుకుంది నేను.. నాన్నను ఎందుకు అడుగుతారు.. 20 లక్షలు మీ మొహాన కొట్టి నా స్తోమత నిరూపిస్తా.. మా నాన్న కడతానన్నా ఒప్పుకోనని ఛాలెంజ్ చేస్తాడు. నాలుగు రోజుల్లో కడతానని అంటే సేటు వెళ్లిపోతాడు.

దీంతో రామరాజుకు టెన్షన్ మొదలవుతుంది. చిన్నోడు 30 లక్షలు, నడిపోడు 20 లక్షలు.. మొత్తం 50 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని ఆలోచిస్తాడు. మరోవైపు ఏదో ఆస్తి అమ్మడం తప్ప దారి లేదనే ఐడియా సుకన్య  ఇవ్వడంతో రామరాజు ఊరి చివర ఉన్న స్థలాన్ని అమ్మేయాలని నిర్ణయిస్తాడు. చిన్నోడు తీసుకుంటాడా అని వేదవతి అంటుంది. నేను వాడి బాబుని, వాడికంటే మొండోడిని అని అంటాడు.

మరోవైపు తిరుపతి గవ్వలు వేస్తూ తల బాదుకుంటుంటే సుకన్య.. ఇక్కడుంటే బికారివి, ఆ ఇంట్లో ఉంటే కుబేరుడివి, వాటా అడిగి అల్లుళ్ల అప్పు తీర్చమని ఐడియా ఇస్తుంది. సాగర్ ఇంట్లో 2 లక్షలు దాచినవి, బ్యాంకులో 3 లక్షలు ఉన్నాయని, మిగతా 15 లక్షలు ఫ్రెండ్స్ దగ్గర తెస్తానని నర్మదతో అంటాడు. విశ్వ, అమూల్య బైక్ పై వెళ్తూ గొడవపడి, తర్వాత ఓ పాప సర్జరీకి డబ్బు సాయం చేసి ప్యాచ్ అప్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Illu Illalu Pillalu Episode 614, Illu Illalu Pillalu Oct 24th Episode, 24th, Illu Illalu Pillalu Today Episode, Illu Illalu Pillalu Latest Episode, Illu Illalu Pillalu Serial, Telugu TV News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com