Illu illalu pillalu : అమూల్య, విశ్వ మాట్లాడుకోవడం చూసేసిన చందు.. శ్రీవల్లి షాక్!
on Dec 12, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -339 లో.. రామరాజు కొడుకులు, కోడళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు అందరు పార్క్ కి వస్తారు. శ్రీవల్లి చందు మాట్లాడుకుంటుంటే అప్పుడే తిరుపతి వస్తాడు. మీరేంటి ఇక్కడ ఆని అడుగుతాడు. సరదాగా వచ్చామని చందు చెప్తాడు. ఆ తర్వాత తిరుపతికి నర్మద, సాగర్ కన్పిస్తారు. వాళ్ళని కూడా అదే ప్రశ్న అడుగుతాడు.
ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ కనిపిస్తారు వాళ్ళని కూడా అదే ప్రశ్న అడుగుతాడు. నువ్వు ఎందుకు వచ్చావ్ మామ అని తిరుపతిని ధీరజ్ అడుగగా నాకు పని ఉండి వచ్చానని అక్కడ నుండి బయల్దేరతాడు. ఆ తర్వాత అమూల్య, విశ్వ ఉన్నవైపు వెళ్తుంటే అప్పుడే తనకి బాల్ తగిలి వెనక్కి వస్తాడు. నా స్వప్న సుందరి ఎక్కడ అంటూ వెతుక్కుంటూ ఉంటాడు. ఆ తర్వాత అందరు ఒకరికొకరు ఎదరుపడుతారు. మీరేంటి ఇక్కడ అంటే మీరేంటి ఇక్కడ అని అందరు అనుకుంటారు. అప్పుడే అటుగా విశ్వ, అమూల్య వెళ్తారు.
వీళ్ళందరు వాళ్ళని చూస్తారేమో అని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. వాళ్ళు వెళ్తుంటే ఎవరికి కన్పించకుండా బెలూన్ తో కవర్ చేస్తుంది. కానీ అమూల్య, విశ్వ మాట్లాడుకోవడం చందు చూసి షాక్ అవుతాడు. చందు చూడడం శ్రీవల్లి చూసి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ధీరజ్, ప్రేమ ఇంటికి వచ్చాక కూడా గొడవ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



