.webp)
బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ నటి అశ్విని శ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మూవీస్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆమె.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, క్యూట్‌నెస్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది .
ఇదిలా ఉంటే.. అశ్విని శ్రీకి సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో ఆమె మనసులో మాట బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తనకు కాబోయే భర్త గ్లామర్‌గా ఉన్నా లేకపోయినా పర్వాలేదని అశ్విని చెప్పింది . అతను నల్లగా ఉన్నా, అందంగా లేకపోయినా తనకు అభ్యంతరం లేదని , మంచి మనసు ఉండాలని, తనను బాగా చూసుకోవాలని సెహెప్పింది . అతని దగ్గర డబ్బు ఉందా లేదా అనే విషయం కూడా తనకు ముఖ్యం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తనకు ఎలాంటి బాయ్‌ఫ్రెండ్ లేడని, చాలామంది తనను ఇష్టపడుతూ తన కోసం ట్రై చేస్తున్నారని కూడా అశ్విని చెప్పింది. అయితే అవతలి వ్యక్తికి తాను నచ్చడం ఒక్కటే సరిపోదని, అతను కూడా తన మనసుకు నచ్చాలని తెలిపింది. ఈ రోజుల్లో అమ్మాయిల వెంటపడే అబ్బాయిలు చాలామంది ఉంటారని, తనలాంటి అందమైన అమ్మాయికి ఫాలోయింగ్ మరింత ఎక్కువగా ఉంటుందని సరదాగా కామెంట్ చేసింది .తనను ప్రేమగా చూసుకునే వ్యక్తి దొరికితే చాలని, అతనికి డబ్బు లేకపోయినా తానే పోషిస్తానని అశ్విని శ్రీ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
----------





.webp)
