.webp)
త్వరలో దసరా వస్తున్న సందర్భంగా "దసరాకి విడుదల " పేరుతో ఆడియన్స్ ముందుకు ఒక ఈవెంట్ రాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజయ్యింది. ఈ ఈవెంట్ కి శైలజ కిరణ్, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, ద్రోణవల్లి హారిక, స్వప్న దత్ వంటి వాళ్లంతా వచ్చారు. ఇక హోమ్ మినిస్టర్ ఐతే ప్రదీప్ ని, అవినాష్ ని రోస్ట్ చేసేసారు. శైలజ కిరణ్ రాగానే అవినాష్ వచ్చి "అత్తయ్యగారు నేను ఎర్రబాబు గుర్తుపట్టారా నన్ను " అని అడిగాడు. "ఎస్ బట్టలు చూస్తేనే తెలుస్తోందిగా" అన్నారు. "అలకలు, ఆర్గుమెంట్లు, డిస్కషన్ లు మన ఇంట్లో కూడా ఇంత బిజీ లైఫ్ లో కూడా అవన్నీ సాధ్యమేనా మేడం " అని అడిగాడు ప్రదీప్. "నిజం చెప్తాను మీకు " అనేసరికి అందరూ నవ్వేశారు.
"హోమ్ మినిస్టర్ గారు వచ్చారు అందుకే ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతున్నాను నేను " అన్నాడు ప్రదీప్. వెంటనే వంగలపూడి అనిత రియాక్ట్ అయ్యారు "అచ్చమైన తెలుగులో" అన్నారు. "ఎంతైనా మా ఊరోళ్లు మా ఊరోళ్ళే " అన్నాడు ప్రదీప్. ఇంతలో ఎరుపు రంగు కాస్ట్యూమ్ లో వచ్చి "మేడం" అనుకుంటూ వచ్చాడు. "గోడలు దూకే వాడు వాడేనా " అంటూ ప్రదీప్ ని అడిగారు. "వాడు అస్తమాను గోడ మీదే ఉండేవాడు మేడం"అన్నాడు ప్రదీప్. వెంటనే ఆవిడ ప్రదీప్ మీద కౌంటర్ వేశారు. "నువ్వు ఎక్కువగా అమ్మాయిల వెనక తిరిగేవాడివి" అన్నారు. "నేనా ఎబ్బే " అన్నాడు. "అప్పుడు మన ఊర్లో " అన్నారు వంగలపూడి అనిత కామెడీగా. ఇక తర్వాత స్వప్న దత్ వచ్చి "ఈ బుల్లెబ్బాయిని బుల్లితెరకు పరిచయం చేసింది నేనే" అంటూ ప్రదీప్ గురించి చెప్పారు. "ఎప్పటి నుంచో ఏ అమ్మాయా అని మేము కూడా చూస్తున్నాం " అన్నారు. "ఇది దసరా కదా మేడం సంక్రాంతికల్లా ఏదో ఒకటి చేసేద్దాం " అన్నాడు ప్రదీప్.




.webp)
.webp)
