.webp)
బుల్లితెరపై తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి హరిత ఇప్పుడు మరో కొత్త అడుగు వేశారు. ఇన్నాళ్లూ సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఆమె, తాజాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన ‘ముద్దమందారం’ సీరియల్ పేరుతో చీరల వ్యాపారాన్ని ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. టీవీ ఆడియన్స్ కి హరిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ‘ముద్దమందారం’ సీరియల్లో అఖిలాండేశ్వరి పాత్రతో ఆమె విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటన, హుందాతనంతో ఆ పాత్రకు గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పటికీ అఖిలాండేశ్వరి పాత్రను ప్రేక్షకులు గుర్తు చేసుకుంటారంటే ఆ క్యారెక్టర్‌కు ఆమె ఎంతగా ప్రాణం పోశారో అర్థం చేసుకోవచ్చు.
‘కుంకుమపువ్వు’, ‘ఋతురాగాలు’, ‘కళ్యాణం కమనీయం’ వంటి పలు సీరియల్స్‌లోనూ హరిత తన నటనతో మెప్పించారు. బుల్లితెరతో పాటు కొన్ని సినిమాల్లోనూ నటించి తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ‘జానకి పరిణయం’ సీరియల్‌తో ఆడియన్స్ కి ఇంకా దగ్గరయ్యారు . మరోవైపు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఫాన్స్ తో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. ఇప్పటివరకు నటిగా, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా కొనసాగిన హరిత.. ఇప్పుడు వ్యాపారవేత్తగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. తన కెరీర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ‘ముద్దమందారం’ పేరునే తన కొత్త వ్యాపారానికి పెట్టుకున్నారు . ‘ముద్దమందారం వస్త్ర నిలయం’ పేరుతో చీరల దుకాణాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని నార్సింగి ప్రాంతంలో ఈ వస్త్ర నిలయాన్ని ఏర్పాటు చేశారు. స్టోర్ ప్రారంభోత్సవానికి హరిత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. హరిత భర్త జాకీకి కూడా నెటిజన్స్ విషెస్ చెప్పారు. ఈ కొత్త వ్యాపారానికి సంబంధించిన పూజా వీడియోను హరిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ప్రతి చీర ఒక కథ చెబుతుంది.. ప్రతి సాంప్రదాయం ఒక జ్ఞాపకంగా మారుతుంది.. మీ అందరి దీవెనలు కావాలి’ అంటూ తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు. సంప్రదాయ వస్త్రాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రారంభించిన ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీస్సులు కావాలని ఆమె కోరారు.
హరిత షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హరిత ఇప్పుడు వ్యాపార రంగంలోనూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక హరిత భర్త జాకీ కూడా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో సహాయక పాత్రలు పోషించిన ఆయన ప్రస్తుతం బుల్లితెరపై బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇలా ఒకవైపు నటనతో తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన హరిత దంపతులకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.




.webp)
.webp)
