.webp)
టాలీవుడ్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ అంటే టాలెంటెడ్ అని మిగతా డైరెక్టర్స్ అంతా చెప్పుకుంటూ ఉంటారు. మూవీస్ విషయంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. ఎన్నో విషయాలపై స్పందిస్తూ సెటైర్స్ కౌంటర్లు కూడా వేస్తూ ఉంటారు. ఈయన ఎన్నో మూవీస్ ని డైరెక్ట్ చేసాడు. అవన్నీ సూపర్ హిట్ లుగా నిలిచాయి. షాక్, మిరపకాయ్, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్యా, దువ్వాడ జగన్నాధం ఇలాంటివెన్నో ఉన్నాయి. అలాంటి హరీష్ శంకర్ రీసెంట్ గా సరిగమప షోకి గెస్ట్ గా వచ్చారు. ఆ స్టేజి మీద ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పారు.
వినీత్ - శ్రీనిధి కలిసి దువ్వాడ జగన్నాధం మూవీలోని "అస్మైక యోగ " అనే సాంగ్ పాడి అందరినీ మెస్మోరైజ్ చేశారు. ఇక హరీష్ శంకర్ ఈ సాంగ్ గురించి చెప్పారు. "నిజానికి ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ముందు సాహితి గారి గురించి చెప్పుకోవాలి. ఆకలేస్తే అన్నం పెడతా అని రాసిన ఆయన నీ ఈడు కోడికూర లాంటి సాంగ్స్ రాసిన ఆయన ఇలాంటి ఒక లిరికల్ రిచ్ సాంగ్ ని రాయడం అంటే ఆయన స్పాన్ ని తెలియజేస్తుంది. హ్యాట్సాఫ్ టు సాహితి గారు. నేను దేవిశ్రీ ప్రసాద్ గారు చేసిన మూడు సినిమాల్లో దాదాపు 13 పాటల్లో నేను గర్వంగా ఈ పాట నాదే అని గర్వంగా చెప్పుకునే పాట ఇది. చాలా బాగా పాడారు. నా సినిమా షూటింగ్ లో ఎలా ఐతే షూట్ చేసానో అలాగే పాడారు. వాయిస్ ని నేను పోల్చుకోలేకపోయాను అంత బాగా పాడారు. ఇక నువ్వు వేసిన డ్రెస్ లాస్ట్ లో వేసిన స్టెప్ బాగా మ్యాచ్ అయ్యింది. సింగర్ అంటే ఊరికే అలా మైక్ పట్టుకుని స్టేజి మీదకు వచ్చి పాడితే కుదరదు . ఎంటర్టైన్ కూడా చేయాలి అందుకే మిమ్మల్ని సింగర్స్ అని పెర్ఫార్మర్స్ అని అంటాం. సింగర్ కి ఉండాల్సిన లక్షణాల్లో పెర్ఫార్మింగ్ అనేది ముఖ్యం. " అని చెప్పారు.






