బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం గుర్తుందా? చీరకట్టులో ఎంతో పద్ధతిగా, హుందాగా కనిపించి టీచర్ గా, తల్లిగా ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆ జగతి మేడం ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆమె అసలు పేరు జ్యోతి పూర్వజ్ అలియాస్ జ్యోతి రాయ్.
సీరియల్ లో జగతి పాత్ర చనిపోవడంతో సీరియల్ రేటింగ్ కూడా పడిపోయిందంటే ఆ పాత్రకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సీరియల్ కి బ్రేక్ చెప్పిన తర్వాత జ్యోతి పూర్వజ్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో రచ్చ లేపుతోంది.తాజాగా జ్యోతి పూర్వజ్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో కనిపించిన జగతి మేడం ఇప్పుడు బ్యాక్ లెస్ డ్రెస్ లు, పొట్టి గౌన్లు, టైగర్ ప్రింట్ డ్రెస్ లతో హీరోయిన్స్ కి పోటీ ఇస్తోంది. తాజాగా బీచ్ లో బ్యాక్ లెస్ డ్రెస్ లో ఇచ్చిన పోజులు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. "జగతి మేడమా మీరేనా?" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం జ్యోతి పూర్వజ్ సినిమాల్లో బిజీగా ఉంది. ఆమె భర్త సుకు పూర్వజ్ డైరెక్షన్ లో Killer, A Masterpiece, Pretty Girl అనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. Killer సినిమాలో ఫిమేల్ సూపర్ హీరోగా కనిపించబోతోంది. ఇన్‌స్టాలో 802 వేల ఫాలోవర్లు ఉన్న ఈ బ్యూటీ పెట్టే ప్రతి ఫోటో ట్రెండింగ్ లో ఉంటోంది.
సీరియల్ లో పద్ధతిగా కనిపించిన జగతి మేడం.. నెట్టింట ఇంత బోల్డ్ గా మారిపోయిందేంటంటూ కొందరు ఆశ్చర్యపోతుంటే, మరికొందరు "హీరోయిన్ మెటీరియల్" అంటూ పొగుడుతున్నారు. ఏదేమైనా 40 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల అమ్మాయిలా ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ కుర్రకారుకి చెమటలు పట్టిస్తోంది జ్యోతి.
[Guppedantha Manasu Jagathi Latest Photos, Jyoti Poorvaj Hot Photos, Jagathi Madam Glamour Look, Guppedantha Manasu Serial Actress Latest News, Jyoti Rai Killer Movie]




