.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-809లో.. మాలిని, జ్యోత్స్న మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంటుంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతున్న సమయంలో సూరజ్ మరోవైపు తన తాత అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. పెద్దవాళ్లు రావడంతో పరిస్థితి మరింత ముదరకుండా గొడవకు ఫుల్స్టాప్ పెట్టాలని మాలిని, జ్యోత్స్న ఇద్దరూ అనుకుంటారు. తను వచ్చిన పని పూర్తయిందని ఇంటికి వెళ్లి వస్తానని జ్యోత్స్న తాతయ్యకు చెప్తుంది.
అయితే ఆమెను ఒంటరిగా పంపడం సరికాదని భావించిన తాతయ్య జ్యోత్స్నకు తోడుగా సూరజ్ ను పంపించాలని నిర్ణయిస్తాడు. దీంతో మాలిని ఒక్కసారిగా ఈర్ష్యతో రగిలిపోతుంది. తన కొడుకు జ్యోత్స్నతో కలిసి వెళ్లడం ఆమెకు ఏమాత్రం నచ్చదు. సూరజ్ మాత్రం తల్లి మనసులో ఏముందో పట్టించుకోకుండా జ్యోత్స్నను ఇంటి దగ్గర దింపి వస్తానని చెప్పి ఆమెతో కలిసి బయలుదేర్తాడు. మరోవైపు జ్యోత్స్న కనిపించకపోవడంతో దీప ఇంట్లో అందరు ఆందోళన చెందుతారు. కార్తీక్ కు ఒక ఆలోచన వచ్చి జ్యోత్స్న మాలిని ఇంటికి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తాడు.
కార్తీక్ వెంటనే సూరజ్ కు ఫోన్ చేసి జ్యోత్స్న గురించి అడగడంతో సూరజ్ తన దగ్గరే ఉందని.. జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి అప్పగిస్తానని చెప్తాడు. ఈ మాట విన్న కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి జ్యోత్స్న నీ దగ్గర ఉందా అని కంగారుగా అడుగుతాడు. సూరజ్, జ్యోత్స్న ఇద్దరు కారులో కలిసి బయలుదేర్తారు. నీకు నాపై ప్రేమ లేకపోతే నేను కనిపించకుండా పోయినప్పుడు ఎందుకు అంతలా స్పందించావంటూ సూరజ్ ను జ్యోత్స్న నిలదీస్తుంది. మార్చురీలో అనాథ శవం కనిపించినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నేను దగ్గరుండి చూశానంటూ గతాన్ని గుర్తుచేస్తుంది.
చివరకు జ్యోత్స్నను తీసుకుని సూరజ్ ఇంటికి చేరుకుని శ్రీమన్నారాయణ కుటుంబసభ్యులను బయటకు పిలిచి జ్యోత్స్నను సుమిత్ర చేతిలో అప్పగిస్తాడు. మీ కూతుర్ని సురక్షితంగా తీసుకొచ్చాను.. ఇక నాపై ఎలాంటి తప్పుడు కేసులు పెట్టొద్దు.. నాకు జ్యోత్స్నకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా తన వైఖరిని స్పష్టం చేసి వెళ్లిపోతాడు. సూరజ్ వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో అందరు జ్యోత్స్నను ప్రశ్నిస్తారు. ఎందుకు వెళ్లావంటూ నిలదీయడంతో తన జీవితాన్ని తనే చూసుకోగలనని, తన విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, పీఏ పోస్ట్ కు రాజీనామా చేసే ప్రసక్తే లేదని జ్యోత్స్న క్లారిటీ ఇస్తుంది.




.webp)
.webp)
