Home

»

Tv News

Godhavari : రిసెప్షన్‌కి జాను ఫ్యామిలీ వస్తుందా..‌పరువు తీయాలని చూస్తున్న సింహాద్రి!

Oct 18, 2026 9:13AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -141 లో రిసెప్షన్ ఏర్పాట్లు పెద్దగా వద్దు సింపుల్ గా చేయండి అని శివుడు, పార్వతిలతో సంజు చెప్తాడు. అలా ఏం లేదు పెద్దగానే చేయాలని శివుడు అంటాడు. ఈ కార్డ్స్ నువ్వు అందరికి ఇచ్చేయ్ అని శేషుతో చెప్తాడు. ఇంతకు జానూ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ కి వస్తున్నారా అని శేషు అడగగా.. వస్తారు మేం వెళ్లి పిలుస్తామని పార్వతి అంటుంది. అవసరం లేదు.. నేను వెళ్లి పిలుస్తానని సంజు అంటాడు. ఆ తర్వాత జాను, సంజు గొడవ పెట్టుకుంటారు. అప్పుడే రమణి వచ్చి చాలా రోజుల తర్వాత మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. జాను నీకు జ్యువలరీ ఉన్నాయా అని అడుగుతుంది.

లేవని జాను చెప్పగానే లేకపోతే ఎలా అని రమణి అంటుంది. సరే మీరు వెళ్లి జ్యువలరీ షాపింగ్ చేయండి అని సంజు అంటాడు. రమణి వెళ్ళాక దొరికింది ఛాన్స్ కదా అని ఎక్కువ షాపింగ్ చేయకని సంజు అనగానే మరి జ్యువలరీతో పారిపోతానా అని జానూ అంటుంది. ఆ తర్వాత జానూ బయటే ఉంటుంది. సంజు ఒక్కడే శారదా ఇంటికి వెళ్తాడు. మా వాళ్ళు రిసెప్షన్ చేస్తున్నారు మీరు రండి అని చెప్తాడు. రమ్మని శారద చెప్తుంది. సంజు వెళ్ళాక ఏంటి శారద అతను ఈ ఇంటికి అల్లుడు అలాగేనా మాట్లాడేది అని పెద్దావిడ అంటుంది. శారద కవర్ చేస్తుంది.

మరొకవైపు శేషుని సింహాద్రి బార్ లో కలుస్తాడు. జానూ, సంజు రిసెప్షన్ అని శేషు చెప్పగానే మంచి పని, అందరిలో జానూ పరువు ఎలా తీస్తానో చూడమని సింహాద్రి అంటాడు. మరొకవైపు పార్వతి, శివుడు హాల్లో ఉండగా కిన్నెరా చాటుగా చూస్తుంది. ఎవరు అని అడుగుతారు. ఊరికే వచ్చానని కిన్నెరా అంటుంది. అప్పుడే జానూ వచ్చి కిన్నెరని తీసుకొని బయటకు వచ్చి హగ్ చేసుకొని ప్రేమగా మాట్లాడుతుంది. రిసెప్షన్ రోజు జానూని ఎలా ఇబ్బంది పెట్టాలని సింహాద్రి ప్లాన్ వేయడంతో అసలు రిసెప్షన్ రోజు ఏం జరగబోతుందోనని ఉత్కంఠ పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Godhavari Today Episode 141, Godhavari Serial October 18th, Sanju Janu Reception Shopping, Simhadri Plan Against Janu]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com