Home

»

Tv News

Godhavari : జానూకి సంజు వార్నింగ్.. నందుకి జాబ్ వస్తుందా!

Oct 14, 2026 10:03AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి' (Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -137 లో జానూ ఇంట్లో వాళ్ల ముందు కావాలనే సంజుకి ఐ లవ్ యూ చెప్తుంది కానీ సంజయ్ చెప్పడు. దీంతో అందరూ వెళ్ళాక కోప్పడుతుంది. ఏంటి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావ్.. ఆల్రెడీ నీ ప్రియుడు ఉన్నాడు కదా.. కేవలం మనది అగ్రిమెంట్ పెళ్లి అని మర్చిపోకని సంజు అంటాడు. మనది అగ్రిమెంట్ పెళ్లే కానీ మీ వాళ్ల కోసం అలా చెప్పాను.. మీరు ఇంకొకసారి సూర్య గురించి తీయొద్దని వార్నింగ్ ఇస్తుంది జానూ.

అగ్రిమెంట్ తర్వాత నువ్వు వెళ్లేది తన దగ్గరికేగా అని సంజు అనగానే అది నా ఇష్టమని జానూ చెప్తుంది. అగ్రిమెంట్ పూర్తి అవగానే వెళ్లిపోతావ్.మ నీ హద్దులో నువ్వు ఉండమని సంజు చెప్తాడు. మరోవైపు నందు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు తాళి తీయడం పెద్దావిడ చూసి అడుగుతుంది. నందు ఏదో చెప్పి కవర్ చేస్తుంది. ఒరేయ్ మురళి మనం మన ఊరు వెళ్లిపోదాం.. నందు మారిపోతుందేమో అనిపిస్తుందని పెద్దావిడ బాధపడుతుంది.. నువ్వేం ఆలోచించకు అమ్మమ్మ అని మురళి అంటాడు. ఆ తర్వాత నందు దగ్గరకు మురళి వెళ్లి ఎందుకు తాళి తీశావ్ అంటాడు. అమ్మమ్మ అబద్ధం చెప్పదు.. నువ్వు నాకు విలువ ఇవ్వకున్నా కనీసం తాళికైనా ఇవ్వమని నందుని మురళి రిక్వెస్ట్ చేస్తాడు.

ఆ తర్వాత శివుడు, పారు ఇద్దరూ సంజు, జానూకి శోభనం జరిపించాలని అనుకుంటారు. అదే విషయం సంజుకి చెప్తే అలాంటి ఆలోచన ఏం వద్దని కోప్పడతాడు. ఆ తర్వాత నందుకి జాబ్ వచ్చిందని మురళి స్వీట్ తీసుకొని వస్తే అవి నందు పడేస్తుంది. నాకు జాబ్ రాలేదు, యాభై వేలు కట్టాలని అంటుంది. నాకు ఫీజు కట్టాలని గౌతమి అప్పుడే అడుగుతుంది. ఇప్పుడే కాదని నందు కోప్పడుతుంది. దీంతో జాను దగ్గరకు గౌతమి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com