Home

»

Tv News

జానూని తాళి తీసేయమన్న సూర్య.. సీక్రెట్ గా వీడియో తీసిన సింహాద్రి!

Oct 9, 2026 10:44AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-133లో జానూ, సంజయ్ ఇద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ల ముందు భార్య భర్తలుగా నటిస్తున్నారు. శివుడు, పార్వతి చూస్తున్నారని ఇంకా కావాలనే ఇద్దరూ ఒకరిని మించి ఒకరు భార్య భర్త అన్నట్లు యాక్టింగ్ చేయడంలో పోటీపడతారు. అదంతా శివుడు, పార్వతి చూసి మురిసిపోతారు.

 

మరోవైపు నందుని మురళి స్కూటీపీ ఎక్కించుకొని ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్తాడు. మనం కూడా బాగా డబ్బు సంపాదించుకొని కార్లో వెళ్దాం అని మురళి అంటాడు.. అప్పుడే స్కూటీ ఆగిపోతుంది. అంతలో జానూ, సంజయ్ గుడికి వెళ్తుంటే వాళ్లు ఆగి ఉండడం చూసి జానూ కార్ ఆపమంటుంది. అక్కా మీరేంటి ఇక్కడ, రండి కార్లో వెళ్దాం అంటుంది. అవసరం లేదు.. నీకు డబ్బు హోదా ఉందని చూపించుకోవడానికి ఇదంతా.. నా జీవితం నాశనం చేశావు.. నువ్వు మాత్రం రెంట్ కి దిగిన రెండు రోజులకే అతన్ని వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నావని నందు కోప్పడుతుంది. ఏం మాట్లాడుతున్నారని నందుపై సంజయ్ సీరియస్ అవుతాడు. ఆ తర్వాత గుడి అటు వైపు ఉంది.. నేను ఇటు వైపు వెళ్లాలి అని జానూని దింపేసి సంజయ్ వెళ్తాడు.

జానూ గుడికి వెళ్తుంది.. దేవుడికి మొక్కుకొని తిరిగి వస్తుంటే సూర్యని చూసి షాక్ అవుతుంది. మరోవైపు నందుని మురళి ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత జానూతో సూర్య మాట్లాడతాడు. అంత ఈజీగా ఎలా మారిపోయావు.. అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్.. నా ప్రేమ నీకు గుర్తురాలేదా అని సూర్య ఎమోషనల్ అవుతాడు. ఆ తాళి తీసేయ్ అని సూర్య అనగానే జాను షాక్ అవుతుంది.

అదంతా సింహాద్రి సీక్రెట్ గా వీడియో తీస్తాడు. ఈ వీడియోతో జానూ, సంజయ్ ల అగ్రిమెంట్ పెళ్లి బయటపడుతుందా? సూర్య వల్ల జానూ జీవితంలో మళ్లీ గొడవలు మొదలవుతాయా? అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com