
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి . ఈ సీరియల్ ఎపిసోడ్ 107లో హైడ్రామా నడిచింది. జానూ వాళ్ల కుటుంబానికి వెంకట్రావ్ సాయం చేస్తున్నాడని సింహాద్రి అతన్ని కొడతాడు. ఆ విషయం వెంకట్రావ్ చెప్పడంతో.. మీకు ఇక ఏ ఇబ్బంది ఉండదు, మేం వేరే ఇల్లు చూసుకున్నాం, వెళ్లిపోతున్నామని జానూ అంటుంది. నాకు ఇలాంటి దెబ్బలు అలవాటే అని వెంకట్రావ్ అంటాడు.
మరుసటి రోజు జానూ, నందు, మురళి వాళ్లు రెంట్ కి తీసుకున్న రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తారు. అక్కడ పెద్దాయన మ్యూజిక్ వింటూ ఉంటాడు. పార్వతి వచ్చి.. ఏవండీ వాళ్లు వచ్చారని పిలుస్తుంది. మీరు ఎప్పుడు వచ్చారని శివరాం అడగ్గా.. మేం ఇందాకే వచ్చాం తాతయ్య అని జానూ చెప్తుంది. ఏం అవసరం ఉన్నా అడగండి.. ఈ రోజు మంచి రోజు ముందు వెళ్లి పాలు పొంగించండి అని పార్వతి చెప్తుంది. దీంతో జానూ వాళ్లు రూంలోకి వెళ్తారు. ఇల్లు చాలా చిన్నదిగా ఉంది.. నందు, మురళి వాళ్లకి ఒక సెపరేట్ రూమ్ ఉంటే బాగుండు అని శారద అంటే.. ఉంది అమ్మా అని జానూ చెప్తుంది. అందరూ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటారు. అప్పుడే పార్వతి, శివరాం వచ్చి మాట్లాడుతారు. అయ్యో అగ్గిపెట్టె లేదని జానూ అనగానే.. నేను తీసుకొని వస్తానని శివరాం వెళ్తుంటే నేను వస్తానని మురళి వెళ్తాడు. వాళ్లకి ఎదురుగా సింహాద్రి వస్తాడు. ఎక్కడరా మీ మరదలు జానూ అని సింహాద్రి గట్టిగా అరుస్తాడు. దీంతో అందరూ బయటకు వస్తారు. ఏయ్ సింహాద్రి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లు అని జాను కోప్పడుతుంది. నా కూతురు పెళ్లిలో నువ్వు చేసిన గొడవ మర్చిపోను.. ఏ ముసలోడా, నువ్వేనా ఈ ఇంటికి ఓనర్, వాళ్లకి ఇల్లు అద్దెకి ఇవ్వకు అని సింహాద్రి బెదిరిస్తాడు.
నా ఇల్లు, నేను ఇస్తానని శివరాం అనగానే సింహాద్రి అతని కాలర్ పట్టుకుని గొడవపడతాడు. అప్పుడే శివరాం మనవడు సంజయ్ ఎంట్రీ ఇచ్చి సింహాద్రిని కొడతాడు. నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్లకపోతే ఏం చేస్తానో తెలియదని సంజయ్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






