స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -54 లో..... సింహాద్రి తీసుకొని వచ్చిన సంబంధం అబద్ధమని జానూకి డౌట్ వస్తుంది. కానీ ఏం చెయ్యలేక తనలో తనే మదనపడుతుంది. నిజం తెలియక ముందే పెళ్లి జరిపించాలని సింహాద్రి అనుకొని పంతులు గారు త్వరగా పెళ్లి జరిపించండి అని చెప్తాడు. మరొకవైపు నాకు ఎందుకో భయంగా ఉంది సూర్య వీళ్లందరిని చూస్తే ఇదంత మోసం అనిపిస్తుందని జానూ అంటుంది. నువ్వేం కంగారు పడకు.. నేనున్నా కదా అని సూర్య అంటాడు.
మరొకవైపు జానూ తనకి తెలిసిన అతన్ని ఆ కుటుంబం గురించి కనుక్కోమని పంపిస్తుంది. అతను వాళ్ళ ఇంటికి వెళ్లి పక్కన వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు పెద్ద ఫ్రాడ్ అని తెలుస్తుంది. ఆ తర్వాత పెళ్లి కొడుకు బాబు ఆడుకుంటూ వెళ్లి పెళ్లి మండపం ముందు పడిపోతాడు. ఆ బాబు ని జానూ లేపుతుంది. అతని చేతిలో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ లో స్క్రీన్ పై అమెరికా అబ్బాయి ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. అది జానూ గమనించి బయటకు వెళ్లి బాబు దగ్గర నుంచి ఫోన్ తీసుకొని చూస్తుంది. ఎవరు బాబు వీళ్ళు అని జాను అడుగుతుంది. మా అమ్మానాన్న అని అతను చెప్తాడు. దాంతో జానూ షాక్ అవుతుంది. అప్పుడే జానూ పంపించిన మనిషి కాల్ చేసి ఆ సంబంధం వాళ్ళు పెద్ద ఫ్రాడ్ అని చెప్తాడు.
ఆ తర్వాత అబ్బాయి నందు మెడలో తాళి కట్టబోతుంటే జానూ ఆగమని చెప్తుంది. ఈ పెళ్లి జరగదని అనగానే ఎందుకు జరగదే అని నందు తనపై కోప్పడుతుంది. వాళ్ళు పెద్ద ఫ్రాడ్ అక్క అని ఫోన్ లో ఫోటో చూపిస్తుంది. బాబు కూడా అతను మా నాన్నే అని చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో నందుని మురళి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




