Home

»

Tv News

Godhavari : డబ్బు పోగొట్టుకున్న మురళి.. జానూకి సంజయ్ షాకింగ్ కండిషన్!

Sep 17, 2026 10:33AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి .‌ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 114 లో....మురళి బ్యాంకు నుంచి డబ్బు తీసుకొని వస్తుంటే కొంతమంది దొంగలు అతన్ని కొట్టి డబ్బు లాక్కొని వెళ్తారు. షర్ట్ కి రక్తపు మరకలతో మురళి హాస్పిటల్ కి రావడంతో అందరు షాక్ అవుతారు. ఏమైందని అడగ్గా జరిగింది చెప్తాడు. అయ్యో ఎంత పని అయింది బావా.. ఆ పని బావకి అప్పగించొద్దని అక్క చెప్పింది కదా అంటూ జానూ టెన్షన్ పడి ఏడుస్తుంది. ఇప్పుడే ఈ విషయం నందుకి చెప్తానని మురళి అంటే..‌వద్దు బావా, ఇప్పటికే అక్క కోపంగా ఉంది, ఈ విషయం తెలిస్తే విడిపోతారని జానూ ఆపుతుంది. నువ్వు ఇంటికి వెళ్లి షర్ట్ చేంజ్ చేసుకో బావా అని పంపిస్తుంది.

 

మరోవైపు పార్వతి భోజనం చేయకపోవడంతో నీరసంగా పడిపోతుంది.‌ వెంటనే సంజయ్ డాక్టర్ ని తీసుకొని వస్తాడు. ఎందుకు అమ్మమ్మ ఇలా చేస్తున్నావని సంజయ్ కోప్పడితే.. నువ్వు మా మాట వినడం లేదు కదా, నీ మాట మేం ఎందుకు వినాలని శివరాం కూడా కోప్పడతాడు. అటు నందు..‌బావ ఇంకా రాలేదేంటని జానూని అడగ్గా.. డబ్బు రావట్లేదట అని జానూ అబద్ధం చెప్తుంది. అందుకే నేను ముందే చెప్పానని నందు కోప్పడుతుంది. ఇటు పార్వతికి సంజయ్ భోజనం తీసుకొచ్చి.. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు.. పెళ్లి చేసుకోవాలంతే కదా చేసుకుంటానని అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.

 

మరోవైపు సూర్య గుడిలో డల్ గా కూర్చొని ఉంటే అదే గుడికి జాను వస్తుంది. తరువాయి భాగంలోనే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. జాను చెల్లి ఆపరేషన్ కి డబ్బు కావాలని తెలిసి సంజయ్.. మీ చెల్లి ఆపరేషన్ కి డబ్బు ఇస్తాను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనే షాకింగ్ కండిషన్ పెట్టడంతో జాను షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com