
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 121 లో.. జాను ఇంటికి రాగానే శారద షాకింగ్ న్యూస్ చెప్తుంది. ఓనర్ గారి మనవడు సంజయ్ జానును పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, వాళ్ల అమ్మమ్మ తాతయ్య సంబంధం అడగడానికి ఇంటికి వచ్చారని చెప్తుంది. దానికి.. ఆ అబ్బాయి ప్రవర్తన బాగోదు, ఆడవాళ్లకు మర్యాద ఇవ్వడు.. అలాంటి వాడితో ఎలా పెళ్లి చేస్తామని నో చెప్పేశామని అంటుంది శారద. జాను అగ్రిమెంట్ గుర్తు చేసుకుని.. అలా ఎలా చెప్తారమ్మా అని అంటుంది. దీంతో నందు, గౌతమి.. వాళ్ల స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి, వాడిని చూస్తేనే చిరాకు అని అంటారు. కిన్నెర ఆపరేషన్ కోసం వచ్చి ఈ ఇంట్లో ఉంటున్నామని.. ఆ అబ్బాయికి నువ్వు చనువు ఇచ్చావా అని జానును శారద నిలదీస్తుంది. పెళ్లి సంబంధం అడగడానికే ఇంత గొడవ చేస్తున్నారు.. అగ్రిమెంట్ గురించి చెపితే ఇంకెంత గొడవ అవుతుందోనని జాను మనసులో భయపడుతుంది.
మరోవైపు జాను కిన్నెర దగ్గరకు హాస్పిటల్ కి వెళ్తుంది. డాక్టర్ చెక్ చేసి కిన్నెరకు ఏ ప్రాబ్లమ్ లేదని శుక్రవారం డిశ్చార్జ్ చేస్తానని చెప్తుంది. శుక్రవారమే సంజయ్ తో తనకు పెళ్లి అని గుర్తుకు రావడంతో జాను టెన్షన్ పడుతుంది. ఇంట్లో మురళీ, నందు సరదాగా మాట్లాడుకుంటుండగా సంజయ్ రావడం చూసి గౌతమి.. విలన్ వస్తున్నాడని అంటుంది. సంజయ్ జానును పిలవడంతో జాను ఫోన్ వచ్చినట్లు నటిస్తూ అతని దగ్గరకు వెళ్తుంది. శుక్రవారమే మన పెళ్లి, అది గుర్తు చేయడానికే పిలిచానని సంజయ్ చెబుతాడు. వాయిదా వేయమని జాను బతిమాలినా సంజయ్ ఒప్పుకోడు.
నీ పేరు ఏంటని సంజయ్ అడిగి జాను పేరు చెప్పాక నెంబర్ తీసుకుని పెళ్లికి టైం, ప్లేస్ మా ఫ్రెండ్ చెప్తాడని అంటాడు. కొంచెం టైం ఇస్తే మా వాళ్లకు నచ్చజెప్తానని జాను అడుగుతాడు. ఇవ్వను, చెప్పిన టైంకి రాకపోతే అగ్రిమెంట్ మీ ఇంట్లో వాళ్లకు చూపిస్తానని సంజయ్ బెదిరిస్తాడు. జాను, సంజయ్ మాట్లాడుకోవడం దూరం నుంచి గౌతమి, నందు చూస్తారు. జాను ఏంటి భయపడుతుందని నందు అనుమానిస్తుంది. జాను తిరిగి రాగానే.. నువ్వేం మాట్లాడావో మాకు తెలిసిపోయిందని మురళీ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Godhavari, Godhavari Episode 121, Star Maa Serial, Janu, Sanjay, Kinnera, Sharada, Nandu, Gowthami, Marriage Agreement, Hospital]




.webp)
(6).webp)
