
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -82 లో..... గౌతమిని తీసుకొని జానూ పోలీస్ స్టేషన్ కి వస్తుంది. గౌతమి తో జరిగింది మొత్తం ఇన్‌స్పెక్టర్ కి చెప్పిస్తుంది. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా చూపిస్తుంది. అది విని ఇంత జరిగినప్పుడు ధైర్యంగా చెప్పాలి కదా అమ్మ అనవసరంగా నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను.. ముందు వెళ్లి కంప్లైంట్ ఇవ్వమని ఇన్‌స్పెక్టర్ అంటాడు. మురళిని బెయిల్ మీద విడిచి పెడుతారు. చాలా థాంక్స్ సూర్య అని గౌతమి చెప్తుంది.
మరొకవైపు శాంతి ఇంటికి వచ్చి.. నా కొడుకుని నాకు కాకుండా చేశారు.ఇంకా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని గొడవ చేస్తుంది. అప్పుడే మురళి వాళ్ళు వస్తారు. ఏంటి నాన్న ఈ దెబ్బలు మన ఇంటికి వెళ్ళిపోదామని అంటుంది. ఏం మాయ చేసావో నా కొడుకు నన్ను పట్టించుకోవడం లేదని నందుతో శాంతి కోప్పడుతుంది. నా భర్త నా ఇష్టం అని నందు అనగానే మురళి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు ఎవరి సైడ్ ఉంటావో చెప్పురా అని శాంతి అనగానే మురళి తెల్చుకోలేక ఇద్దరు గొప్పవాళ్ళు అని చెప్తాడు. నువ్వు కుడా ఇక్కడే ఉండిపోమని మురళి అనగానే నేను అసలు ఉండనని శాంతి వెళ్ళిపోతుంది. మరొకవైపు నిత్య బర్త్ డే కి సింహాద్రి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడే పోలీసులు వచ్చి కళ్యాణ్ ని అరెస్ట్ చేస్తామని చెప్తారు. గౌతమిని మీ అబ్బాయి కిడ్నాప్ చేసి టార్చర్ చేసాడు అందుకు సాక్ష్యం కూడా చూపించాడని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. కళ్యాణ్ ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు.
అరుణ ఏడుస్తుంటే నువ్వు ఏడవకు.. ఏం చెయ్యాలో నాకు తెలుసని సింహాద్రి అంటాడు. ఆ తర్వాత జానూకి సూర్య కలవాలని మెసేజ్ చేస్తాడు. అది చూసి జాను బయల్దేరుతుంది అప్పుడే సింహాద్రి వచ్చి నా కొడుకుని అరెస్ట్ చేయించావని కోప్పడుతాడు. శారద అది విని ఎందుకు అరెస్ట్ చేయించావని అడుగుతుంది. గౌతమి ఎంత భయపడుతుందో చూసావ్ కదా అమ్మ అని జాను అంటుంది. తరువాయి భాగంలో నిత్యకి బర్త్ డే గిఫ్ట్ గా నా కొడుకుని ఇస్తున్నానని భువన చెప్తుంది. మరొకవైపు మా అమ్మని మన పెళ్లికి ఒప్పిస్తానని జానూ కి సూర్య చీర గిఫ్ట్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





