
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 92 లో....బావ మనం సిటీకి వెళదాం.. షాప్ ని అమ్మేద్దామని మురళితో నందు అంటుంది. అలా ఏం వద్దు అమ్మకి తెలిస్తే బాగోదని మురళి అంటాడు. నీకు మీ అమ్మ ముఖ్యమా.. నేను ముఖ్యమా అలా అయితే కిన్నెరకి ఎలా ఆపరేషన్ చేయిస్తామని నందు అంటుంది. మురళికి ఎటు తెల్చుకోలేని పరిస్థితి.
మరొకవైపు జాను కోసం సూర్య వెయిట్ చేస్తాడు. ఏంటి ఎందుకు రమ్మన్నారు.. నాతో మీకేంటి అని జాను కోప్పడుతుంది. జాను ప్లీజ్ ఒక్కసారి నా మాట విను ఎలాంటి పరిస్థితిలో ఆ ఎంగేజ్మెంట్ చేసుకున్నానో నీకు తెలియదని జరిగింది మొత్తం వివరిస్తాడు. ఇప్పుడు అమ్మ బ్లాక్మెయిల్ చేస్తే ఎంగేజ్మెంట్ చేసుకున్నావ్.. ఇప్పుడు మావయ్య బ్లాక్మెయిల్ చేస్తే పెళ్లి చేసుకుంటావా అని జాను అడుగుతుంది. నేను నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని సూర్య తనని హగ్ చేసుకొని చెప్తాడు. ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది పెళ్లి కాదు కదా పెళ్లి అంటూ చేసుకుంటూ అది నిన్ను మాత్రమే.. ఇప్పుడు నేను జాబ్ అంటూ బెంగుళూరు వెళ్తాను.. నీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక వస్తాను.. అప్పుడు పెళ్లి చేసుకుందామని సూర్య అనగానే సూర్య పట్టుకొని జాను ఏడుస్తుంది.
అదంతా నిత్య చూస్తుంది. మరొకవైపు మురళి తన ఇంటికి వెళ్లి షాప్ పత్రాలు తీసువాలనుకుంటాడు. ఇంటికి తాళం ఉండడంతో బాబిన్ దాన్ని పగులగొడుతాడు. షాప్ పత్రాలు తీసుకొని వెళ్తుంటే శాంతి వస్తుంది. అమ్మ కిన్నెరకి ఆపరేషన్ చేయించాలి అంటాడు. దాంతో శాంతి కోప్పడుతుంది. మరొకవైపు సింహాద్రి, భువన శుభలేఖలు చూస్తుంటే నిత్య వచ్చి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు.. అక్కడ జానూతో సూర్య బావ రొమాన్స్ చేస్తున్నాడని కోప్పడుతుంది. అప్పుడే సూర్య వస్తాడు. తన కాలర్ పట్టుకొని జానూతో నువు చేస్తుంది ఏంటని అడుగుతుంది. నిన్ను ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటాను.. నువ్వంటే ఇష్టమని చెప్పానా.. అదే జానూకి ఎన్నిసార్లు చెప్పానో.. నేను జానుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని సూర్య చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






