Home

»

Tv News

Godhavari : సూర్యపై మురళి ఫైర్.. నందు చేసిన ఘాటు పనుల వల్ల ఇంట్లో కలకలం!

Aug 22, 2026 9:17AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  గోదావరి Godhavari . ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 89 లో......సూర్య కాలర్ పట్టుకొని మురళి నిలదీస్తాడు. ఎందుకు జానూ నీ మోసం చేసావని కోప్పడతాడు. బావ తనతో మాటలేంటి లోపలకిరా అని జాను కోప్పడుతుంది. అదంతా భువన, సింహాద్రి చూస్తారు. సూర్య చూసావా.. చెల్లి ఎంగేజ్మెంట్ అయినా కూడా ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాడో అందుకే వాళ్ళకి త్వరగా పెళ్లి చేద్దామని అనుకున్నానని సింహాద్రి అంటాడు.

 

మరొకవైపు సూర్యతో గడిపిన క్షణాలు అన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది జాను. అప్పుడే నందు వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. సూర్య, నిత్యకి ఎంగేజ్మెంట్ అయిందని చెప్తుంది. ఎవరికైనా డబ్బు అవసరం సూర్య కూడా అంతే అని నందు అంటుంది. అలా ఎందుకు అంటున్నావని మురళి అంటాడు. నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నా.. మొన్న రెస్టారెంట్ లో డబ్బు కట్టడానికి ఆ జేబు ఈ జేబు చూసి వెతికావ్ కదా.. ఎవరైనా నీలాంటి వాడిని ప్రేమిస్తారా అని నందు అంటుంది. దాంతో మురళి బాధపడతాడు.

 

ఆ తర్వాత ఫ్యామిలీని తీసుకొని మురళి షాపింగ్ కి వస్తాడు. కిన్నెర, గౌతమి, జానూకి డ్రస్ లు తీసుకుంటాడు. నందుకి మంచి చీర సెలక్షన్ చెయ్యాలని అనుకుంటాడు. ఒక చీర సెలక్షన్ చేసుకొని తీసుకుంటాడు. మరొకవైపు కిన్నెరకి జాను టానిక్ పోస్తూ ఉంటుంది. అప్పుడే మురళి బట్టలు తీసుకొని వచ్చి అందరికి ఇస్తాడు. నందు తనకి ఇచ్చిన చీర చూసి చీర నచ్చలేదని మురళి మొహంపై విసిరేస్తుంది. దాంతో పెద్దావిడ తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com