Home

»

Tv News

Godhavari : కోర్టు స్టేతో దిగొచ్చిన సింహాద్రి..తోట దక్కడంతో కుటుంబంలో ఆనందం!

Jul 31, 2026 9:57AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -70 లో.....తోట రిజిస్ట్రేషన్ అవుతుంటే నందు తన ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఆపుతుంది. సింహాద్రిని పేరు పెట్టి పిలుస్తుంటే మర్యాదగా మాట్లాడమని భువన అంటుంది. తోట మాది ఇది ఎవరికి అమ్మే రైట్ లేదని నందు అంటుంది. మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఎంతో కొంత పడేస్తానని సింహాద్రి అంటాడు. తోట గురించి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని తోటని కొనడానికి వచ్చిన వాళ్ళు అంటుంటే ఏం లేదు అండి వాళ్ళ నాన్న చనిపోయి వాళ్ళ మైండ్ సరిగ్గా పని చెయ్యడం లేదని సింహాద్రి అంటాడు.

ఏం మాట్లాడుతున్నావ్ రా అని సింహాద్రి కాలర్ పట్టుకొని అడుగుతుంది శారద.
 సింహాద్రి ఇంకా మాటలతో మాయ చెయ్యబోతుంటే శారద తన చెంపచెల్లుమనిపిస్తుంది. అప్పుడే తోట అమ్మిన అసలు వ్యక్తి రామరావు వాళ్ళ అన్నయ్యని అక్కడికి పంపిస్తాడు. అతన్ని తీసుకొని జాను వస్తుంది. పెద్దనాన్న నువ్వు ఎందుకు వచ్చావని రామరావు కొడుకు అడుగుతాడు. నువ్వు నోరు ముయ్ రా పాపం శంకర్ నారాయణ మంచి వ్యక్తి.. అలాంటి అతన్ని మోసం చేశారని అతను అంటాడు. తోటని అమ్మడానికి వీల్లేదని జాను కోర్ట్ నుంచి స్టే తీసుకొని వస్తుంది. దాంతో కొనడానికి వచ్చినవాళ్ళు అడ్వాన్స్ గా ఇచ్చిన అమౌంట్ కట్టాలి లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని సింహాద్రికి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత మా అన్నయ్య మీకోసం మంచి చెయ్యాలని చూస్తే మీరు ఇలా చేస్తున్నారని భువన అంటుంది. మీకు ఇంకా అర్ధం కాలేదా.. మీ అన్నయ్య ఎలాంటి వాడో మేం తేలుస్తామని జాను అంటుంది. ఆ తర్వాత సూర్య దగ్గరికి జాను వెళ్లి సూర్య నాకు చాలా సంతోషంగా ఉంది. మా తోట మాకు వస్తుందని అంటుంది. అమ్మగారు మంచి మూడ్ లో ఉన్నారు.. ప్రేమ గురించి చెప్పండి బాబు అని సూర్యతో తుఫాన్ అంటాడు.  సూర్య చెప్పబోతుంటే జానూకి ఫోన్ వచ్చి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జాను ఇంట్లో అందరితో సంతోషంగా మాట్లాడుతుంది. నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదని జానూతో శారద అంటుంది. ఇప్పుడు అవన్నీ అవసరం లేవమ్మా అది నాన్న కష్టమని జాను అంటుంది.

ఆ తర్వాత ఇన్ని రోజులుగా సింహాద్రి అంకుల్ చాలా చేసాడు. ఇప్పుడు ఒక్క దానితో మోసగాడు అవుతాడా అని గౌతమి అంటుంది. నీ క్లాస్ మేట్ కళ్యాణ్ వాళ్ళ నాన్న అని సపోర్ట్ చేస్తున్నావా నాణెంకి రెండు వైపులా చూడాలని జాను అంటుంది. దాంతో గౌతమికి కోపం వస్తుంది. ఎక్కడ గొడవ అవుతుందోనని పదండి భోజనం చేద్దామని మురళి అంటాడు. మరొకవైపు జాను చేసిన పనికి సింహాద్రి కోపంగా ఉంటాడు. తరువాయి భాగంలో మురళికి బ్లౌజ్ కుట్టమని ఆర్డర్ వస్తుంది. అచ్చం నందులాగా మా అమ్మాయి ఉంటుందని కస్టమర్ చెప్తుంది. దాంతో నందు కొలతలు మురళి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com